Law చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
ABN , Publish Date - Dec 28 , 2024 | 11:40 PM
Law మహిళలు చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కోటబొమ్మాళి జూనియర్ సివిల్ న్యాయాధికారి బీఎంఆర్ ప్రసన్నలత అన్నారు.

జలుమూరు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మహిళలు చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కోటబొమ్మాళి జూనియర్ సివిల్ న్యాయాధికారి బీఎంఆర్ ప్రసన్నలత అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శనివారం మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చట్టపరంగా మహిళలకు ఉన్న హక్కులు, బాధ్యతలను తెలుసుకోవాలన్నారు. ఏదైనా సమస్య వస్తే ఎలా బయట పడాలనేది విషయాలను తెలుసుకోవాలన్నారు. ఆడ పిల్లలను ఇంటికి పరిమితం చేయకుండా చదివించాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ జన్ని రామారావు, ఎంపీడీవో కె.అప్పలనాయుడు, వెలుగు ఏపీఎం ఎస్.హేమసుందర్, న్యాయవాదులు హరిప్రియ, సౌజన్య, హెచ్‌సీ రాజశేఖర్, పలువురు మహిళలు పాల్గొన్నారు.
ఉచిత న్యాయసహాయాన్ని సద్వినియోగం చేసుకోండి
నరసన్నపేట, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఆర్థిక స్థోమత లేని రిమాండ్‌లో ఉన్న ఖైదీలకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత న్యాయసహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సివిల్ కోర్టు న్యాయాధికారి సీహెచ్ హరిప్రియ అన్నారు. శనివారం సబ్‌జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీలకు అందుతున్న భోజన, ఆరోగ్య సేవలపై ఆరా తీశారు. న్యాయవాదులు జీవీ రమణ, తూలుగు మధు, జైలు సూపరింటెండెంట్ వినయ్‌కుమార్ పాల్గొన్నారు.