Share News

ఈఏపీ సెట్‌లో మెరిశారు

ABN , Publish Date - Jun 11 , 2024 | 11:31 PM

ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీ)లో జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. బాలికల కన్నా.. బాలురు మంచి ర్యాంకులు సాధించారు.

ఈఏపీ సెట్‌లో మెరిశారు

- ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీలో జిల్లా విద్యార్థుల సత్తా

(గుజరాతీపేట/ టెక్కలి/ నరసన్నపేట/ పొందూరు/ జలుమూరు)

ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీ)లో జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. బాలికల కన్నా.. బాలురు మంచి ర్యాంకులు సాధించారు. గత నెల 16 నుంచి 23వ తేదీ వరకూ జిల్లావ్యాప్తంగా నాలుగు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మంగళవారం ఫలి తాలు విడుదలయ్యాయి.

అగ్రికల్చర్‌, ఫార్మసీలో జిల్లాలో మొదటి పది ర్యాంకులు:

అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగంలో టెక్కలికి చెందిన మల్లిపెద్ది ప్రణవసాయి 12వ ర్యాంకు సాధించాడు. జిల్లా టాప్‌టెన్‌ ర్యాంకుల్లో ముందంజలో నిలిచాడు. ఇప్పటికే ప్రణవసాయి నీట్‌ ఫలితాల్లో 710 మార్కులు సాధించి ఆల్‌ఇండియా కేటగిరిలో 430వ ర్యాంక్‌, ఓబీసీ కేటగిరిలో 114వ ర్యాంక్‌ సాధించాడు. తెలంగాణ ఎంసెట్‌లో 62వ ర్యాంక్‌ దక్కించుకున్నాడు. ఈఏపీ సెట్‌లో ఉత్తమ ర్యాంకు రావడంతో తల్లిదండ్రులు మధు, సంతోషికుమారితో పాటు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే బండి గౌతమి (తీమర, పాత పట్నం) 24వ ర్యాంకు జరుగుళ్ల నాగ కార్తీక్‌ (పొందరవీధి, శ్రీకాకుళం) 40 వ ర్యాంకు, గొల్లపల్లి రిజేత(కోటబొమ్మాళి) 55వ ర్యాంకు, కింజరాపు సన్‌జోగ్‌ నాయుడు (పీఎన్‌కాలనీ, శ్రీకాకుళం) 80వ ర్యాంకు సాధించారు. నరసన్నపేట మండలం సత్యవరం గ్రామానికి చెందిన తాండ్రాపు సుభాష్య అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మశీ విభాగంలో 85వ ర్యాంకు సాధించింది. తండ్రి శ్రీనివాసరావు అంపోలు ఉన్నత పాఠశాలలో పీడీగా పనిచేస్తున్నారు. అలాగే తోట సుహిత (తోటవాడ, బూర్జ) 86వ ర్యాంకు సాధించింది. పొందూరు మండలం అచ్చి పోలవలస గ్రామానికి చెందిన గురుగుబెల్లి జయకిషోర్‌ అగ్రికల్చర్‌ విభాగంలో 89 వర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులు వెంకటసత్యనారాయణ, సుజాత, వ్యవసాయ కూలీలు. అలాగే లండ సంజయ్‌ (వంకులూరు) 104వ ర్యాంకు, కొల్లి రామతరుణ్‌తేజ(పాతపట్నం) 110వ ర్యాంకు సాధించారు.

ఇంజనీరింగ్‌లో జిల్లాలో మొదటి పది ర్యాంకులు :

ఇంజినీరింగ్‌ విభాగంలో జిల్లాలో ఉమ్మడి జిల్లా పాలకొండ మండలం యరకరాయపురానికి చెందిన సతివాడ జ్యోతిరాదిత్య 39వ ర్యాంకు సాధిం చాడు. జిల్లా టాప్‌ టెన్‌ ర్యాంకుల్లో ముందంజలో నిలిచాడు. జ్యోతిరాదిత్య తల్లిదండ్రులు సతివాడ మోహనరావు, హైమావతి. మోహనరావు ఎచ్చెర్లలో సోషల్‌వెల్ఫేర్‌ పాఠశాలలో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి హైమావతి శ్రీకాకుళం ఆర్టీసీ డిపోలో సిస్టమ్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళంలోని భైరివానిపేటలో నివసిస్తున్నారు. అలాగే మాడుగుల మూర్తి మణిదీప్‌ (సత్యనగర్‌ కాలనీ, శ్రీకాకుళం) 77వ ర్యాంకు సాధించాడు. అలాగే జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్‌కుమార్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో 135 మార్కులతో 81వ ర్యాంకు సాధించాడు. ఇటీవల విడుదలైన జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జాతీయస్థాయిలో 637వ ర్యాంకు, ఓబీసీలో 88వ ర్యాంకు దక్కించుకున్నాడు. తల్లిదండ్రులు చింతు బుచ్చెన్న, రమాదేవి.. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. వీరి స్వస్థలం కరవంజ కాగా.. వృత్తిరీత్యా ప్రస్తుతం పాలకొండలో నివాసముంటున్నారు. అలాగే మావురు జస్వంత్‌ (గోవిందనగర్‌ కాలనీ, శ్రీకాకుళం) 84వ ర్యాంకు, గొర్లె పవన్‌కు మార్‌ (నడుకూరు, వీరఘట్టం) 89వ ర్యాంకు సాధించారు. అలాగే నరసన్నపేట శ్రీరామ నగర్‌కు చెందిన కోరాడ సౌదీప్‌ 124వ ర్యాంకు సాధించారు. తల్లిదండ్రులు వైకుంఠరావు, దుర్గాభవానీ ఇద్దరు ఉపాధ్యా యులే. అలాగే సకలాభక్తుల సాయిబద్రీష్‌ (కోటబొమ్మాళి) 128వ ర్యాంకు, మెట్ట సతీష్‌ చంద్ర (వెంకటాపురం, ఎచ్చెర్ల) 157వ ర్యాంకు, జల్లు శ్రీహరీష్‌ (చిన జల్లుపుట్టుగ, కవిటి) 235 వ ర్యాంకు, అన్నెపు సాత్విక్‌ (పొడుగుపాడు, కోటబొమ్మాళి) 235వ ర్యాంకు సాధించారు. వీరితో పలువురు ఉత్తమ ర్యాం కులతో ప్రతిభ చూపారు.

Updated Date - Jun 11 , 2024 | 11:32 PM