Share News

సిక్కోలులో సెగలు

ABN , Publish Date - Apr 06 , 2024 | 11:44 PM

సిక్కోలు సెగలు గక్కుతోంది. గత మూడు రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. దీనికి తోడు తీవ్ర వడగాల్పులతో ప్రజలు అల్లాడుతున్నారు.

 సిక్కోలులో సెగలు
శ్రీకాకుళంలో పొట్టిశ్రీరాములు జంక్షన్‌ వద్ద రోడ్డుపై నిర్మానుష్యం

- దంచికొడుతున్న ఎండలు

- అల్లాడుతున్న జనం

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

సిక్కోలు సెగలు గక్కుతోంది. గత మూడు రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. దీనికి తోడు తీవ్ర వడగాల్పులతో ప్రజలు అల్లాడుతున్నారు. శనివారం పలుచోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆమదాలవలసలో 41.6, బూర్జ 40.8, జి.సిగడాం 42.5, హిరమండలం 40.9, జలుమూరు 41.6, కంచిలి 40.0, కోటబొమ్మాళి 41.6, ఎల్‌ఎన్‌ పేట 40.0, మెళియాపుట్టి 43.0, నందిగాం 39.3, నరసన్నపేట 41.6, పలాస 40.3, పాతపట్టణం 42.3, పోలాకి 40.0, సారవకోట 42.7, సరబుజ్జిలి 40.6, శ్రీకాకుళంలో 40.1 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలకు జనాలు లేక రహదారులు నిర్మానుష్యంగా మారాయి. శ్రీకాకుళం నగరంలో ఎప్పుడూ రద్దీగా ఉండే పొట్టిశ్రీరాముల జంక్షన్‌, ఏడురోడ్ల జంక్షన్‌, జీటీ రోడ్లు.. మధ్యాహ్నం కర్ఫ్యూని తలపించాయి. వడగాల్పులకు భయపడి ఎక్కువ మంది సాయంత్రం వరకు ఇళ్లకే పరిమితమయ్యారు. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఐస్‌క్రీమ్‌, లస్సీ, కొబ్బరి నీళ్లు, తదితర పానీయాలు తాగారు.

Updated Date - Apr 06 , 2024 | 11:44 PM