రైతులకు అందుబాటులో విత్తనాలు
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:12 AM
: రైతులకు కావల్సిన ఐదు రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారి భార్గవి అన్నారు. గురువారం బిర్లంగి ఆర్‌బీకేలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖరీఫ్ విత్తనాల కోసం రైతులు ఆర్‌బీకేలలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియపై రైతులకు అవగహన కల్పించారు. రైతులకు అందుబాటులో ఇంద్ర, అమర, స్వర్ణ మసూరు, సాంబమసూరు, శ్రీకాకుళం సన్నాలు ఉన్నాయన్నారు. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాలు అందించినట్టు తెలిపారు.

ఇచ్ఛాపురం: రైతులకు కావల్సిన ఐదు రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారి భార్గవి అన్నారు. గురువారం బిర్లంగి ఆర్‌బీకేలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖరీఫ్ విత్తనాల కోసం రైతులు ఆర్‌బీకేలలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియపై రైతులకు అవగహన కల్పించారు. రైతులకు అందుబాటులో ఇంద్ర, అమర, స్వర్ణ మసూరు, సాంబమసూరు, శ్రీకాకుళం సన్నాలు ఉన్నాయన్నారు. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాలు అందించినట్టు తెలిపారు.
పచ్చిరొట్ట విత్తనాలతో ప్రయోజనం..
సరుబుజ్జిలి: పచ్చిరొట్ట విత్తనాల వల్ల పంటలకు క్రిములు, కీటకాల బెడద లేకుండా దిగుబడులు పెరుగుతాయని వెలుగు కమ్యూనిటీ కో-ఆర్డినేటర్ కూన రోజాలత తెలిపారు. మండలంలోని రావివలస ప్రకృతి వ్యవసాయ టీమ్ ఆధ్వర్యంలో అందించిన పచ్చిరొట్ట విత్తనాలు గురువారం రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. వ్యవసాయ పనిముట్లు, చోడి విత్తనాలు కూడా రైతులు కోరిన తక్షణమే అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏపీసీఎన్‌ఎఫ్ తిరుపతిరావు, టి.సుమ, వీవోఏ మంగమ్మ, సీసీ సూర్యనారాయణ పాల్గొన్నారు.