Share News

సీదిరి సార్‌..జంతిబంద ఏమైంది?

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:19 AM

ఉద్దాన ప్రాంత ప్రజల ఏకైక సాగునీటి వనరు జంతిబంద. సముద్ర పాదభాగానికి ఆనుకొని ఉన్న కొండల ప్రాంతం నుంచి సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని ఒడిసి పట్టుకుంటే ఉద్దానం ఉద్యానవనంగా మారనుంది. దీనికి గాను జంతిబందను రిజర్వాయర్‌గా మలిచేందుకు ఆరు దశాబ్దాలుగా ముఖ్యమంత్రులు, మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో ఇస్తున్న హామీలు గాలిలో కలిసిపోయాయి. ప్రతిపాదనలు జరిగాయి. గత టీడీపీ ప్రభుత్వంలో నిధులు మంజూరై టెండర్ల ప్రక్రియలోనే నిలిచిపోగా.. ఐదేళ్లు గడిచినా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయలేదు. ప్రతిపక్షనేత హోదాలో రిజర్వాయర్‌ ప్రతిపాదిత స్థలం పక్క రోడ్డునుంచే పాదయాత్ర చేపట్టిన వైఎస్‌ జగన్‌ సీఎం అయి ఐదేళ్లు పూర్తయినా జంతిబంద ఊసేలేదు. ప్రస్తుతం ఎన్నికలు రావడంతో జంతిబంద రిజర్వాయర్‌ మళ్లీ ప్రజలమధ్య నానుతోంది.

సీదిరి సార్‌..జంతిబంద ఏమైంది?
: జంతిబంద రిజర్వాయర్‌ నిర్మించాల్సిన ప్రదేశం

ఉద్దాన ప్రాంత ప్రజల ఏకైక సాగునీటి వనరు జంతిబంద. సముద్ర పాదభాగానికి ఆనుకొని ఉన్న కొండల ప్రాంతం నుంచి సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని ఒడిసి పట్టుకుంటే ఉద్దానం ఉద్యానవనంగా మారనుంది. దీనికి గాను జంతిబందను రిజర్వాయర్‌గా మలిచేందుకు ఆరు దశాబ్దాలుగా ముఖ్యమంత్రులు, మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో ఇస్తున్న హామీలు గాలిలో కలిసిపోయాయి. ప్రతిపాదనలు జరిగాయి. గత టీడీపీ ప్రభుత్వంలో నిధులు మంజూరై టెండర్ల ప్రక్రియలోనే నిలిచిపోగా.. ఐదేళ్లు గడిచినా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయలేదు. ప్రతిపక్షనేత హోదాలో రిజర్వాయర్‌ ప్రతిపాదిత స్థలం పక్క రోడ్డునుంచే పాదయాత్ర చేపట్టిన వైఎస్‌ జగన్‌ సీఎం అయి ఐదేళ్లు పూర్తయినా జంతిబంద ఊసేలేదు. ప్రస్తుతం ఎన్నికలు రావడంతో జంతిబంద రిజర్వాయర్‌ మళ్లీ ప్రజలమధ్య నానుతోంది.

(హరిపురం)

ఉద్దానం ప్రాంతంలో ప్రధాన సాగునీటి వనరుగా జంతిబందను మారిస్తే మందస, సోంపేట, వజ్రపు కొత్తూరు మండలాల పరిధిలో సుమారు 25 వేల ఎకరాల మెట్ట భూములకు సాగునీరు అందనుంది. రైతుల విన్న పాల మేరకు ఈ ప్రాంతాన్ని సందర్శించిన ప్రతి ఒక్క నాయకుడూ రిజర్వాయరుగా నిర్మించేందుకు కృషి చేస్తా మని హామీలిచ్చారు. నేటికీ ఆశలు నెరవేరకుపోగా భూములు పనికిరాకుండా పోయాయి. దీనిని నిర్మిస్తే సాగునీటితో పాటు ఈ ప్రాంతంలో సుమారు 200 గ్రామాలకు తాగునీటి కొరత తీరనుందని పలువురు మేథావులు, స్థానికులు అభిప్రాయపడు తున్నారు. కాగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నాటి ఎమ్మెల్యే గౌతు శివాజీ ప్రత్యేక నీటి పారుదల శాఖ అధికారు లతో సర్వే చేసి రూ.185 లక్షలతో ప్రతి పాదనలు చేశారు. టెండర్లు పిలిచినా ధరలు పెరగడంతో నిధులు ఏమాత్రం సరిపోవని కాంట్రాక్టర్లు వెనుకడుగు వే శారు. ప్రభుత్వం మారడంతో అప్పటినుంచి నేటివరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. దీంతో ప్రస్తుతం కొత్త ధరలతో జంతిబందను రిజర్వాయర్‌గా మార్చేందుకు కనీసం రూ.10 కోట్ల వ్యయం అవుతుందని సంబంధిత అధికారుల అంచ నాకు వచ్చారు. దీంతో వైసీపీ ప్రభుత్వం ఆ దిశగా కనీసం ప్రయత్నాలు చేయకపోవడంతో రైతుల కల నెరవేరలేదు.

నాయకుల హామీలివీ..

ఫ ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర చేపట్టిన సందర్భంగా హరిపురంలో జెండా ఆవిష్కరించి, అధికారంలోకి వచ్చిన వెంటనే జంతిబందను రిజర్వాయరుగా మారుస్తామని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హామీనిచ్చారు. అధికారం చేపట్టిన తరువాత దాన్ని మరిచిపోయారు.

ఫపేదల పెన్నిది సర్దారు గౌతు లచ్చన్న, మాజీ మంత్రి మజ్జి తులసీదాస్‌ ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చలేదు.

ఫ ఎమ్మెల్యేగా గతంలోనే గౌతు శ్యాంసుందర శివాజీ రిజర్వాయర్‌ నిర్మాణానికి హామీనివ్వగా, నిధులు కేటాయించి టెండర్ల దశవరకు తీసుకెళ్లారు. నిధులు సరిపోక కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవటంతో అక్కడతోనే నిలిచిపోయాయి.

ఫ ఎమ్మెల్సీ మాజీ సభ్యురాలు మజ్జి శారద, మాజీ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు, పలాస- కాశీబుగ్గ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌, గతంలో ఎమ్మెల్యేగా పోటీచేసిన వజ్జబాబురావు, దివంగత ఎమ్మెల్యే కొర్ల రేవతీపతి, మాజీ ఎంపీ కణితి విశ్వనాథం హామీలిచ్చిన నాయకుల జాబితాలో ఉన్నారు.

ఫ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రిగా ధర్మాన ప్రసాదరావు బహాడపల్లిలో మాట్లాడు తూ జంతిబంద నిర్మాణానికి హామీనిచ్చి మరిచారు.

ఫ గత ఎన్నికల సమయంలోనూ, అనంతరం మంత్రి సీదిరి అప్పలరాజు జంతిబందను పరిశీలించి రిజర్వాయర్‌గా నిర్మాణం చేపడతామన్న హామీ సైతం తుంగలో తొక్కారు.

ఫ ఏళ్లు గడిచినా.. నాయకులు మారినా జంతిబంద తల రాత మారటం లేదు.. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక తీరడం లేదు.

Updated Date - Apr 18 , 2024 | 12:19 AM