Share News

రేపు నామినేషన్ల పరిశీలన: కలెక్టర్‌

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:27 AM

నామినేషన్ల పరిశీలన ఈనెల 26న (శుక్ర వారం) ఉంటుందని, అలాగే 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరించుకోవచ్చని జిల్లా ఎన్ని కల అధికారి మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ తెలిపారు. కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆర్వోలు, నోడల్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు.

 రేపు నామినేషన్ల పరిశీలన: కలెక్టర్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ మంజీర్‌ జిలానీ సమూన్‌

కలెక్టరేట్‌: నామినేషన్ల పరిశీలన ఈనెల 26న (శుక్ర వారం) ఉంటుందని, అలాగే 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరించుకోవచ్చని జిల్లా ఎన్ని కల అధికారి మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ తెలిపారు. కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆర్వోలు, నోడల్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ల ఉప సంహరణ తరు వాత గుర్తులు (సింబల్స్‌) కేటాయిస్తామని, ఈ ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు జరుగకుండా చర్యలు తీసుకున్నా మన్నారు. మే 7 నుంచి 9 వరకు హోం ఓటింగ్‌కు చర్యలు తీసుకోనున్నామ న్నారు. మే 13న పోలింగ్‌, జూన్‌ 4న కౌం టింగ్‌ జరుగుతుంద న్నారు. బుధవారం రాత్రికి కిత్తగా ఓటు నమోదు, బదిలీకి సంబంధించిన దరఖాస్తులను పరిష్కరించ నున్నట్లు తెలిపారు. వచ్చే నెల 4న జరుగనున్న ఎన్నికల కమిషన్‌ వీడియో కాన్ఫరెన్స్‌కు అధికారులు సంబంధిత నివేదికలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈనెల 27, 28 తేదీల్లో ఎన్నికల విధులు నిర్వర్తి స్తున్న సిబ్బందికి ఉత్తర్వులు అందజేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ ఎం.నవీన్‌, డీఆర్వో ఎం.గణ పతిరావు, సహాయ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, ఆర్వోలు, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

కంట్రోల్‌ రూమ్‌ పరిశీలన

సాధారణ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌, కంట్రోల్‌ రూమ్‌ లను జిల్లా ఎన్నికల అధికారి మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ బుధవారం పరిశీలిం చారు. అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా వ్యవహరించాలని ఆదేశించారు. కాల్‌ సెంటర్‌, సీ- విజిల్‌కు వస్తున్న ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సీపీవో ప్రసన్నలక్ష్మి, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్‌, హౌసింగ్‌ పీడీ గణపతిరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:27 AM