Share News

ఎన్నికల ఖర్చుల రికార్డుల పరిశీలన

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:40 PM

టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధి నుంచి ఎన్నికల ఖర్చుల వివరాలను వ్యయ పరిశీలకుడు శరవణ కుమార్‌ రిటర్నింగ్‌ అధికారి నూరుల్‌ కమర్‌తో కలిసి పరి శీలించారు. ఇప్పటివరకు నామినేషన్లు, రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో ఏ మేరకు ఖర్చుల వివరాలు అందజేశారన్న విషయాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

 ఎన్నికల ఖర్చుల రికార్డుల పరిశీలన

టెక్కలి: టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధి నుంచి ఎన్నికల ఖర్చుల వివరాలను వ్యయ పరిశీలకుడు శరవణ కుమార్‌ రిటర్నింగ్‌ అధికారి నూరుల్‌ కమర్‌తో కలిసి పరి శీలించారు. ఇప్పటివరకు నామినేషన్లు, రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో ఏ మేరకు ఖర్చుల వివరాలు అందజేశారన్న విషయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే వీడియో సర్వే లైన్స్‌ బృందాలు గుర్తించిన వీడియోలు ఒక్కొక్కటిగా పరిశీ లించి పలు సూచనలు చేశారు. వివరాలన్నీ పక్కాగా ఉండా లని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సర్వేలైన్స్‌ బృందాలు, ఫ్ల యింగ్‌ సర్వేలైన్స్‌ బృందాలు జీపీఎస్‌లు అమర్చిన వాహనాల పై మరింత నిఘా ఉంచాలన్నారు.

శ్రీకూర్మనాథుని సేవలో ఎన్నికల పరిశీలకులు

గార: ప్రసిద్ధ శ్రీవైష్ణవ క్షేత్రం శ్రీకూర్మం కూర్మనాథ స్వామిని శుక్రవారం ఎన్నికల పరిశీల కులు నవీన్‌ కుమార్‌ సోనీ, కోమల్‌ జిత్‌ మీనా (ఐఆర్‌ఎస్‌) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చరిత్రను అర్చకుడు మురళీకృష్ణ వివరించారు. అనంతరం వారిని అర్చకులు ఆశీర్వదించి స్వామి వారి చిత్రపటం, ప్రసాదాన్ని అందించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ కృష్ణ ప్రసా ద్‌, వీఆర్వో జగదీష్‌, నర్సుబాబు, అర్చకుడు కిషోర్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:40 PM