న్యాయాధికారిగా సంతోష లక్ష్మి
ABN , Publish Date - Jan 29 , 2024 | 11:40 PM
నగరంపల్లి గ్రామానికి చెంది కర్రి సంతోష లక్ష్మి న్యాయాధికారిగా ఎంపికయ్యారు. సర్పంచ్‌గా సేవలందించిన సంతోష్ లక్ష్మి న్యాయశాస్త్రం చదికి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ పరీక్షలు రాసి అందులో ప్రతిభ కనబరిచి జూనియర్ సివిల్ న్యాయాధికారిగా ఎంపికయ్యారు.
వజ్రపుకొత్తూరు: నగరంపల్లి గ్రామానికి చెంది కర్రి సంతోష లక్ష్మి న్యాయాధికారిగా ఎంపికయ్యారు. సర్పంచ్‌గా సేవలందించిన సంతోష్ లక్ష్మి న్యాయశాస్త్రం చదికి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ పరీక్షలు రాసి అందులో ప్రతిభ కనబరిచి జూనియర్ సివిల్ న్యాయాధికారిగా ఎంపికయ్యారు. సర్పంచ్‌గా ఐదేళ్లపాటు గ్రామానికి విశేష సేవలు అందించారు. భర్త దువ్వాడ వెంకట్‌కుమార్ చౌదరి ప్రోత్సాహంతో పరీక్షలు రాసి విజయం సాధించి నట్లు ఆమె తెలిపారు. సంతోష లక్ష్మి సివిల్ న్యాయాధికారిగా ఎంపికవడంపై నగరంపల్లితో పాటు కన్నవారి గ్రామమైన మందస మండలం డబారు గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను ఎచ్చెర్ల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ మాజీ వీసీ హనుమంతు లజపతిరాయ్, రాజ్యలక్ష్మి దంపతులు, మాజీ సర్పంచ్ దువ్వాడ జయరాం చౌదరి, మురళి, లత, దువ్వాడ రమేష్‌కుమార్ చౌదరి తదితరులు అబినందించారు.