ముగిసిన సంక్రాంతి సంబరాలు
ABN , Publish Date - Jan 18 , 2024 | 12:04 AM
సంక్రాంతి సంబరాలు బుధవారం ముక్కనుమతో ముగిశాయి. కొత్త అల్లుళ్లతో గ్రామాలు కళ కళలాడాయి. ఆడ పిల్లలకు ముక్కు కుట్టే ఉత్సవాలు జరి పారు. గ్రామాల్లో ఆటపాటలతో చిన్నారులు అదరగొట్టారు. గాలిపటాలను ఏగురువేసి ఆనందం పొందారు. ముక్కనుమ సందర్భంగా మాంసం, మందు దుకాణాల వద్ద ప్రజలు ఎగబడ్డారు. అధిక ధరలకు మాంసం, చేపలను కొనుగోలు చేశారు.
మాంసం, మందు దుకాణాల వద్ద జనం బారులు
తిరుగుముఖం పట్టిన ఉద్యోగులు, వలస కూలీలు
నరసన్నపేట: సంక్రాంతి సంబరాలు బుధవారం ముక్కనుమతో ముగిశాయి. కొత్త అల్లుళ్లతో గ్రామాలు కళ కళలాడాయి. ఆడ పిల్లలకు ముక్కు కుట్టే ఉత్సవాలు జరి పారు. గ్రామాల్లో ఆటపాటలతో చిన్నారులు అదరగొట్టారు. గాలిపటాలను ఏగురువేసి ఆనందం పొందారు. ముక్కనుమ సందర్భంగా మాంసం, మందు దుకాణాల వద్ద ప్రజలు ఎగబడ్డారు. అధిక ధరలకు మాంసం, చేపలను కొనుగోలు చేశారు. సంక్రాంతి సంబరాలు ముగియడంతో ఇతర ప్రాం తాల నుంచి స్వగ్రామాలకు వచ్చిన వారంతా తిరుగుముఖం పట్టారు. జమ్ము, కంబాకాయి, మాకి వలస, ఉర్లాం, నడగాం, చోడవరం, సుందరాపురం తదితర గ్రామాల్లో ముక్కనుమ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ప్రయాణికులతో బస్సుల కిటకిట
స్వగ్రామాల నుంచి ఉద్యోగులు విఽధి నిర్వహణకు, వలస పక్షులు పనుల నిమిత్తం వెళ్లేందుకు బయ లుదేరడంతో బస్సులు కిటకిటలాడాయి. నరసన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ వెళ్లే బస్సు లకు ప్రయాణికులు ఎగబడ్డారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు బస్సులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉర్లాం, తిలారు రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటకిట లాడాయి.
ప్రయాణికుల అవస్థలు
నందిగాం: సంక్రాంతి పండగ ముగియడంతో తిరుగు ప్రయాణంలో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. స్వగ్రా మాలకు వచ్చిన వారంతా తిరుగుముఖం పట్టడంతో పాటు కన్న వారింటికి వచ్చిన కొత్త జంటలు వారి గ్రామాలు, పట్ట ణాలకు వెళ్లేందుకు బస్సులు సకాలంలో రాకపోవడంతో పలు కూడళ్లలో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. నందిగాం, పెద్దతామరాపల్లి, నర్శిపురం జంక్షన్, కొండతెంబూరు, కాపుతెంబూరు జంక్షన్ తదితర ప్రాంతాల్లో ప్రయాణికులు వేచి ఉండడం కనిపించింది.
తిరుగు ప్రయాణికుల నిరీక్షణ
పాతపట్నం: సంక్రాంతి పండగ నేపథ్యంలో దూర ప్రాం తాల నుంచి వచ్చిన వారు తిరుగు ప్రయాణంతో బస్సులు కిటకిటలాడాయి. ప్రధాన కూడళ్లలో గంటల తరబడి ప్రజలు నిరీక్షించాల్సి వచ్చింది. శ్రీకాకుళానికి చెందిన ఆర్టీసీ బస్సు మొరాయించడంతో ప్రయాణికులకు ఇబ్బంది తప్పలేదు.
చల్లవానిపేట కూడలిలో ట్రాఫిక్ జాం
జలుమూరు:సంక్రాంతి సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వచ్చి తిరిగి వెళ్లేందుకు వాహ నాల్లో ప్రయాణం కాగా చల్లవానిపేట కూడలిలో వాహనాలు నిలిచి పోయి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ప్రయాణికులతో రైల్వేస్టేషన్లు, బస్ కాంప్లెక్సులు కిటకిటలాడాయి.