Share News

ఘనంగా శంకరాచార్యుల జయంతి

ABN , Publish Date - May 12 , 2024 | 11:59 PM

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం జగద్గురు ఆది శంకరాచార్యుల జయంతిని నిర్వహించారు. అనివెట్టి మండపంలో శంకరాచార్యుల చిత్రపటానికి ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర శర్మ ప్రత్యేక పూజలు చేశారు.

ఘనంగా శంకరాచార్యుల జయంతి
ఉపనిషన్మందిరంలో శంకరాచార్యుల చిత్రపటం వద్ద పూజలు చేసిన దృశ్యం

అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం జగద్గురు ఆది శంకరాచార్యుల జయంతిని నిర్వహించారు. అనివెట్టి మండపంలో శంకరాచార్యుల చిత్రపటానికి ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర శర్మ ప్రత్యేక పూజలు చేశారు. శంకరుల విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో ఈవో ఎస్‌. చంద్రశేఖర్‌, ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ కృష్ణమాచార్యులు, బీఎస్‌ చక్రవర్తి, అర్చకులు నేతేటి హరిబాబు, దర్భముళ్ల శ్రీనివాసశర్మ, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఉపనిషన్మందిరంలో..

శ్రీకాకుళం కల్చరల్‌: నగరంలోని పాలకొండ రోడ్డులో ఉన్న ఉపనిషన్మందిరంలో జగద్గురువు శంకరాచార్యుల జయంతిని ఆది వారం నిర్వహించారు. మందిరం అధ్యక్షుడు గుమ్మా నగేష్‌ ఆధ్వ ర్యంలో జరిగిన కార్యక్రమంలో శంకరుల చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేశారు. కార్యక్ర మంలో ఉపాధ్యక్షుడు పి.పతంజలి శాస్త్రి, కార్యదర్శి కామేశ్వరరావు, డా.ఎం.మోహనరావు, సనపల నారా యణ మూర్తి, డీజీ పట్నాయక్‌, ఎన్‌.నర్సింహమూర్తి, పి.బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

పట్టణంలోని ఉమారుద్రకోటేశ్వర స్వామి దేవాలయంలో జగద్గురు ఆదిశంకరాచార్యులు జయంతి సందర్భంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆరవెల్లి శ్రీరామ మూర్తి శర్మ, చంద్ర శేఖర శర్మ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ఈవో సుక న్య, సిబ్బంది, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2024 | 11:59 PM