Share News

రైల్వే గేట్ల వద్ద భద్రతా నియమాలు పాటించాలి

ABN , Publish Date - Jun 06 , 2024 | 11:54 PM

: రైల్వే గేట్ల వద్ద వాహనచోదకులు భద్రతా నియమాలు పాటించి రైల్వే అధికా రులకు సహకరిం చాలని లోకోఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌కుమార్‌ కోరారు. గురువారం కాశీబుగ్గ ఎల్‌సీ గేటు వద్ద రైల్వే భద్రతా వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైల్వేగేట్లకు ఢీకొని రైలు పట్టాలకు ఎటువంటి నష్టం కలిగించినా రైల్వే చట్టాలు కఠినంగా అమలు చేస్తామని తెలిపారు. గేటు వేసేముందు సైరన్‌ మోగుతుందని, దీంతో గేటుకు దూరంలో వాహనాలు నిలిపివేయాలని కోరారు. గేటు వేసే సమయంలో ముందుగా వాహనాలువెళ్తే భారీ జరిమానా విధించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్టేషన్‌మేనేజర్‌ ఎస్‌.దాస్‌, డీటీఐ కె.భగవతిరావు, ఆర్పీఎఫ్‌ ఓసీ ఎం.మహాపాత్రో, ఆర్‌.రమేష్‌, కెఎస్‌.కుష్వహా పాల్గొన్నారు.

 రైల్వే గేట్ల వద్ద భద్రతా నియమాలు పాటించాలి
కాశీబుగ్గ ఎల్‌సీ గేటు వద్ద భద్రతా నియమాలు వివరిస్తున్న కిరణ్‌కుమార్‌ :

పలాస: రైల్వే గేట్ల వద్ద వాహనచోదకులు భద్రతా నియమాలు పాటించి రైల్వే అధికా రులకు సహకరిం చాలని లోకోఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌కుమార్‌ కోరారు. గురువారం కాశీబుగ్గ ఎల్‌సీ గేటు వద్ద రైల్వే భద్రతా వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైల్వేగేట్లకు ఢీకొని రైలు పట్టాలకు ఎటువంటి నష్టం కలిగించినా రైల్వే చట్టాలు కఠినంగా అమలు చేస్తామని తెలిపారు. గేటు వేసేముందు సైరన్‌ మోగుతుందని, దీంతో గేటుకు దూరంలో వాహనాలు నిలిపివేయాలని కోరారు. గేటు వేసే సమయంలో ముందుగా వాహనాలువెళ్తే భారీ జరిమానా విధించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్టేషన్‌మేనేజర్‌ ఎస్‌.దాస్‌, డీటీఐ కె.భగవతిరావు, ఆర్పీఎఫ్‌ ఓసీ ఎం.మహాపాత్రో, ఆర్‌.రమేష్‌, కెఎస్‌.కుష్వహా పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2024 | 11:54 PM