Share News

పల్లె ప్రగతే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Oct 21 , 2024 | 12:06 AM

పల్లె ప్రగతికి కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు.

పల్లె ప్రగతే ప్రభుత్వ ధ్యేయం
శ్రీకాకుళం రూరల్‌: శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే శంకర్‌

- ఎమ్మెల్యే బెందాళం అశోక్‌

ఇచ్ఛాపురం, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): పల్లె ప్రగతికి కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు. పల్లె పండుగలో భాగంగా ఆదివారం బాలకృష్ణాపురం పంచాయతీలో రూ.28 లక్షలతో కేదారిపురం పంచాయతీలో రూ.25 లక్షలతో సీసీ రోడ్లు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్ధాపన చేసి మాట్లాడారు. అలా గే మున్సిపాల్టీ పరిధి 23వ వార్డు బెల్లుపడ కాలనీలో పలు అభి వృద్ధి పనులకు ఎమ్మెల్యే తోపాటు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిలక రా జ్యలక్ష్మి భూమి పూజ చేశారు. కూటమి నాయకులు దాసరి రాజు, బుద్దా నిర్మలారెడ్డి, దక్కత ఢిల్లీరావు, సాలిన ఢిల్లీ, కొండా శంకర్‌, నం దికి జాని, కాళ్ల జయదేవ్‌, శాసన శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

గ్రామాలకు మహర్దశ

- ఎమ్మెల్యే గొండు శంకర్‌

శ్రీకాకుళం రూరల్‌/గార, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): పల్లె పండు గతో గ్రామాలకు మహర్ధశ రానుందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. మండలంలోని రాగోలు, గూడెం, వాకలవలస, లంకాం, ఒప్పంగి, సానివాడ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకర్‌ ఆదివారం శంకుస్థాపన చేశారు. కూటమి నాయకులు తది తరులు పాల్గొన్నారు. అలాగే గార మండలం అంపోలు, కె.సైరిగాం, సతివాడ, నిజామాబాద్‌, కొర్ని, కొర్లాం, కొమరవానిపేట గ్రామాల్లో నిర్వహించిన పల్లె పండుగలో పాల్గొని వివిధ పనులకు శంకు స్థాపన చేశారు. కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు.

గ్రామస్వరాజ్య సాధనే లక్ష్యం

- ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

నరసన్నపేట, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పించి గ్రామ స్వరాజ్య సాధనే పల్లె పండగ లక్ష్యమని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. ఆదివారం పట్టణంలో బండివీధి, కంబకాయి గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మా ణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. కూటమి నాయకులు బలగ ప్రవీణ్‌, గొద్దు చిట్టిబాబు, శిమ్మ చంద్రశేఖర్‌, సరియపల్లి మధు, ఎంపీడీవో మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.

హామీలను నెరవేరుస్తున్నాం

- ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాసరూరల్‌/ మందస, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తు న్నామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. పలాస మండలం చినంచల, లొద్దభద్ర, రాజగోపాలపురం, మాకన్నపల్లి, మందసలో రోడ్ల నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమా ల్లో కూటమి నాయకులు వజ్జ బాబూరావు, కుత్తుమ లక్ష్మణకు మార్‌, పీరికట్ల విఠల్‌, దువ్వాడ సంతోష్‌కుమార్‌, జీకే నాయుడు, భావన దుర్యోధన, దాసరి తాతారావు తదితరులు పాల్గొన్నారు.

గ్రామాలకు కొత్తరూపు

- ఎమ్మెల్యే ఎంజీఆర్‌

పాతపట్నం/మెళియాపుట్టి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులతో గ్రామాలు కొత్తరూపు దాల్చుకోనున్నాయని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. తామర, తీమర, పాతపట్నంలోని హనుమాన్‌నగర్‌, మెళియాపుట్టి మండలం పెద్దపద్మాపురం, మాకనాపల్లిల్లో సీసీ రోడ్లు, కాలువల నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో కూటమి నాయకులు పైల బాబ్జీ, సతీష్‌, ప్రసాద్‌ రామారావు, ఎస్‌.మోహనరావు, తహసీల్దార్‌, ఎంపీడీవో పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 12:06 AM