పూరీ రథయాత్రకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:40 PM
ప్రపంచంలోనే అత్యంత పాధాన్యం, విశిష్టత కలిగిన పూరీ జగన్నాథస్వామి రథయాత్రకు శ్రీకాకుళం నుంచి ప్రత్యేక లగ్జరీ బస్సులు నడుపుతున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి ఎ.విజయకుమార్ తెలిపారు.

అరసవల్లి, జూలై 8: ప్రపంచంలోనే అత్యంత పాధాన్యం, విశిష్టత కలిగిన పూరీ జగన్నాథస్వామి రథయాత్రకు శ్రీకాకుళం నుంచి ప్రత్యేక లగ్జరీ బస్సులు నడుపుతున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి ఎ.విజయకుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం కరపత్రాలు ఆవిష్కరించారు. ‘ఈ నెల 13న శ్రీకాకుళం కాంప్లెక్స్ నుంచి రాత్రి 8.00 గంటలకు బయలు దేరే ఈ ప్రత్యేక బస్సు 14న ఉదయం 5.00 గంటలకు పూరి చేరుకుంటుంది. జగన్నాథుని దర్శనం అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి కోణార్కు సూర్యదేవాలయం సందర్శన ఉంటుంది. అనంతరం సాయంత్రం 6.00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.00గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుంది. యాత్రకు సంబంధించి ఒక్కరికి టిక్కెట్ ధర రూ.2200గా నిర్ణయించాం. ఆన్‌లైన్ ద్వారా కూడా టిక్కెట్లు బుక్ చేసుకోచ్చు’ అని విజయకుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు 73829 21647, 99592 25608, 99592 25609, 73829 17289 నెంబర్లలలో సంప్రదించాలని సూచించారు.
నౌపడా నుంచి ప్రత్యేక రైళ్లు
టెక్కలి: జగన్నాథుని రథయాత్ర పురస్కరించుకొని ఈనెల 15, 16, 17 తేదీల్లో నౌపడా రైల్వేస్టేషన్ నుంచి పూరీకి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ‘ఈ రైళ్లు ఉదయం 4 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.05 గంటలకు పూరీకి చేరుకుంటాయి. అలాగే 15, 17 తేదీల్లో రాత్రి 11గంటలకు పూరీలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.40 గంటలకు నౌపడాకు చేరుకుంటాయి. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాల’ని అధికారులు కోరారు.