రైల్వే గేటును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ABN , Publish Date - Feb 11 , 2024 | 12:04 AM
కాశీబుగ్గ ఎల్‌సీ గేటును ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో గేటు ధ్వంసమైంది. ఈ సంఘ టనతో సుమారు గంటపాటు రైలు, రోడ్డు ట్రాఫిక్ నిలిచిపోయింది.
- గంటపాటు స్తంభించిన రైలు, రోడ్డు ట్రాఫిక్
పలాస: కాశీబుగ్గ ఎల్‌సీ గేటును ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో గేటు ధ్వంసమైంది. ఈ సంఘ టనతో సుమారు గంటపాటు రైలు, రోడ్డు ట్రాఫిక్ నిలిచిపోయింది. శనివారం ఉదయం 9 గంటల సమ యంలో ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. శ్రీకాకుళం-2 డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు పలాస ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకోవాల్సి ఉంది. ఎల్‌సి గేటు వద్దకు వస్తున్న సమయంలో గేటు వేసేందుకు సైరన్ మోగడంతో దీన్ని గుర్తించని ఆర్టీసీ డ్రైవర్ బస్సు లోపలకు వెళ్లే క్రమంలో గేటును ఢీకొంది. గేటు విరిగి బస్సుపై పడడంతో గేట్‌మేన్ అప్రమత్తమై రైళ్లకు సిగ్నల్ ఇవ్వకుండా జాగ్రత్త వహించారు. అనంతరం రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని గేటును సరి చేయించారు. ఈ నేపథ్యంలో గంటపాటు బెంగుళూరు-హౌరా, పాసింజర్ రైలుతో పాటు మొత్తం నాలుగు రైళ్లు వివిధ రైల్వే స్టేషన్లలో నిలిచిపోయాయి. రోడ్డుపై ట్రాఫిక్ కిలోమీటరు పొడవునా నిలిచిపోవడంతో కాశీ బుగ్గ పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి కారణమైన బస్సును రైల్వే పోలీసులు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని ఆర్‌పీఎఫ్ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు.