హుద్‌హుద్ ఇళ్ల కాలనీలకు రూ.3.60 కోట్లు మంజూరు
ABN , Publish Date - Sep 22 , 2024 | 11:51 PM
పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో హుద్‌హుద్ కాలనీ లు, గృహాల్లో సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభు త్వం రూ.3.60 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.
పలాస ఎమ్మెల్యే శిరీష
పలస, సెప్టెంబరు 22: పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో హుద్‌హుద్ కాలనీ లు, గృహాల్లో సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభు త్వం రూ.3.60 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. 2019లో పూర్తయిన హుద్‌హుద్ ఇళ్లను ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వకపోవడంతో మరమ్మతులకు గురయ్యా యన్నారు. వాటిని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అలాగే ఇళ్ల సముదాయాలకు రోడ్లు, విద్యుత్, తాగునీటి కల్పనకు ఈ నిధులను వినియోగించనున్నారన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం 384 ఇళ్లను మంజూరు చేసి నిర్మాణం చేపట్టిం దన్నారు. వైసీపీ హయాంలో నిర్లక్ష్యం వహించడంతో పాడయ్యాయన్నారు. వీటి మరమ్మతులకు కలెక్టర్ ఆదేశాల మేరకు మార్గదర్శకాలు తయారు చేశామని, పాత లబ్ధిదారులు ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొంది నట్లయితే వారిని మినహాయించి మిగిలిన వారికి అందిస్తామన్నారు.