Share News

జీఎస్టీ ఎగవేసిన వ్యాపారులకు రూ.12 లక్షల జరిమానా

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:45 PM

జీఎస్టీ ఎగవేస్తూ పక్కవారి పేరిట బిల్లులు సృ ష్టించి ఇనుప తుక్కును తరలిస్తున్న కంటైనర్‌ ను శ్రీకాకుళం ప్రాంతీయ నిఘా అమలు అధి కారులు (విజిలెన్స్‌) పట్టుకుని రూ.12 లక్షలు జరిమానా విధించారు.

జీఎస్టీ ఎగవేసిన వ్యాపారులకు రూ.12 లక్షల జరిమానా

శ్రీకాకుళంక్రైం, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): జీఎస్టీ ఎగవేస్తూ పక్కవారి పేరిట బిల్లులు సృ ష్టించి ఇనుప తుక్కును తరలిస్తున్న కంటైనర్‌ ను శ్రీకాకుళం ప్రాంతీయ నిఘా అమలు అధి కారులు (విజిలెన్స్‌) పట్టుకుని రూ.12 లక్షలు జరిమానా విధించారు. వివరాల్లోకి వెళ్తే.. రా జాం, పూసపాటిరేగ, సాలూరు, శ్రీకాకుళానికి చెందిన కొందరు వ్యాపారులు ఇనుప తుక్కును వేరే వ్యక్తుల పేరిట బిల్లులు సృష్టించి జీఎస్టీ ఎగవేసి సరుకును గుంటూరులోని కొన్ని కం పెనీల సహాయంతో ఇతర ప్రాంతాలకు రవా ణా చేస్తున్నట్టు విజిలెన్స్‌ అధికారులు గుర్తిం చారు. ఈ మేరకు ఇనుప తుక్కు తరలిస్తున్న పలు లారీలను శుక్రవారం పట్టుకున్నట్టు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ బి.ప్రసాదరావు తెలిపారు. ఎస్పీ ఆధ్వర్యంలో బృందాలు రాజాం వద్ద రెండు లారీలు, శ్రీకాకుళం, సాలూరు, పూ సపాటిరేగల వద్ద ఒక్కో లారీ చొప్పున పట్టుకు న్నట్టు వివరించారు. సంబంధిత పన్ను ఎగవేత దారుల నుంచి జీఎస్టీ అధికారుల ద్వారా రూ.12,06,980 జరిమానా వసూలు చేసినట్టు చెప్పారు. దీనిపై విచారణ చేపట్టగా ఇటువంటి లావాదేవీలు గుంటూరులోని మురళీ ట్రేడర్స్‌ యాజమాన్యం చేస్తున్నట్టు విజిలెన్స్‌ అధికా రులు గుర్తించారు. తక్షణమే వారి జీఎస్టీని రద్దు చేశామన్నారు. వ్యాపారులంతా చట్టప్ర కారం పన్నులు చెల్లించాలని విజిలెన్స్‌ ఎస్పీ బర్ల ప్రసాదరావు సూచించారు.

Updated Date - Oct 25 , 2024 | 11:45 PM