Share News

లారీ ఢీకొని ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ మృతి

ABN , Publish Date - Mar 06 , 2024 | 11:57 PM

వంజంగి గ్రామ సమీపంలో లారీ ఢీకొని ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ రాల మేరకు.. ఎచ్చెర్ల మండలం కుశాలపురం గ్రామానికి చెందిన ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ చింతాడ ముకుందరావు(57) ఆమదా లవలస రైల్వేస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.

లారీ ఢీకొని ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ మృతి

శ్రీకాకుళంక్రైం/ ఆమదాలవలస: వంజంగి గ్రామ సమీపంలో లారీ ఢీకొని ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ రాల మేరకు.. ఎచ్చెర్ల మండలం కుశాలపురం గ్రామానికి చెందిన ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ చింతాడ ముకుందరావు(57) ఆమదా లవలస రైల్వేస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. విధులు ముగించుకొని ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వస్తుండగా వంజంగి గ్రామం వద్ద లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న శ్రీకాకుళం రూరల్‌ ఎస్‌ఐ వాసు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

‘కానిస్టేబుల్‌ది ప్రభుత్వ హత్యే’

ఆమదాలవలస: శ్రీకాకుళం-ఆమదాలవలస రహ దారిలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్ర మాదంలో మృతి చెందిన ఆర్‌ిపీఎఫ్‌ కానిస్టేబుల్‌ చింతాడ ముకుందరావుది ప్రభుత్వ హత్యగా ఆమదాలవలస నియోజకవర్గ బీజేపీ కన్వీనర్‌ పేడాడ సూరపునాయుడు ఆరోపిస్తున్నారు. బుధవారం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ.. ప్రజలు ఎన్నుకొనే ప్రభుత్వాలు, ప్రజల ప్రాణాలకు ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 11:57 PM