Share News

ఘోరం

ABN , Publish Date - Jul 30 , 2024 | 11:43 PM

రణస్థలం మండలం పైడిభీమవరం వద్ద జాతీయ రహ దారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఇందుకు సంబం ధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ఘోరం
హర్యాని, జీవన్‌ (ఫైల్‌)

- పైడిభీమవరం వద్ద రోడ్డు ప్రమాదం

- ఫ్లైఓవర్‌ డివైడర్‌ను ఢీకొన్న బైక్‌

- మహిళ, యువకుడి మృతి

- మృతులు మందస మండల వాసులు

- తుని నుంచి వస్తుండగా ఘటన

రణస్థలం, జూలై 30: రణస్థలం మండలం పైడిభీమవరం వద్ద జాతీయ రహ దారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఇందుకు సంబం ధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మందస మండలం బొగాబంద పం చాయతీ కడుముసాయి గ్రామానికి చెందిన సవర హర్యాని(25), సవర జీవన్‌ (20)లు సమీప బంధువులు. వరుసకు వదినా మరిది అవుతారు. వీరు బైక్‌పై కాకి నాడ జిల్లా తునిలో మంగళవారం మధ్యాహ్నం బయలుదేరారు. రాత్రి 9గంటల సమయంలో పైడిభీమవరం ఫ్లైఓవర్‌ వద్దకు వచ్చేసరికి బైక్‌ అదుపు తప్పి డివై డర్‌ను ఢీకొట్టింది. హర్యాని అక్కడికక్కడే మృతిచెందగా.. జీవన్‌ ఫ్లైఓవర్‌ కిందకు పడి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యా రు. సమాచారం అందుకున్న జాతీయ రహదారి భద్రతా సిబ్బందితో పాటు జేఆర్‌ పురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల ఫోన్‌ల ద్వారా వీరు మం దస మండలం కుడుమసాయి వాసులుగా గుర్తించారు. హర్యానికి కొన్నాళ్ల కిందటే అదే గ్రామానికి చెందిన వెంకటేష్‌తో వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న పాప కూడా ఉంది. వెంకటేష్‌.. రాజమండ్రిలో కుక్‌గా పనిచేస్తున్నాడు. జీవన్‌ సైతం కుక్‌గా తునిలో కొనసాగుతున్నాడు. వీరు సమీప బంధువులు. వెంకటేష్‌కు జీవన్‌ సోదరుడు వరుస అవుతాడు. ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో వ్యవసాయ పనుల నిమిత్తం గ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు మృతుల కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్టు జేఆర్‌ పురం పోలీసులు తెలిపారు.

Updated Date - Jul 30 , 2024 | 11:43 PM