త్రుటిలో తప్పిన ప్రమాదం
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:47 PM
జగన్నాథపురం రోడ్డు మలుపు వద్ద ప్రైవేట్ బస్సు అదుపు తప్పి గుంతలో కూరికిపోయి త్రుటిలో ప్రమాదం తప్పిన ఘటన శుక్రవా రం చోటుచేసుకుంది.

ఇచ్ఛాపురం, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): జగన్నాథపురం రోడ్డు మలుపు వద్ద ప్రైవేట్ బస్సు అదుపు తప్పి గుంతలో కూరికిపోయి త్రుటిలో ప్రమాదం తప్పిన ఘటన శుక్రవా రం చోటుచేసుకుంది. బరంపురం నుంచి ఇచ్ఛాపురం మీదుగా పాత్రపురం వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు జగన్నాథపురం వద్ద రోడ్డు మలుపులో ఉన్న గోతులో బస్సు వెనుక చ క్రాలు కూరికిపోయాయి. దీంతో బస్సు ముందు భాగం ఒక్కసారిగాపైకి లేచిపో యింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికు లు ఆహాకారాలు వేస్తూ భయాందోళన చెందారు. వెంటనే స్ధానికలు బస్సు వద్దకు చేరుకొని పయాణికులను బయటకు దిం చారు. ఎదురెదురుగా వస్తున్న బస్సును తప్పించే క్రమంలో మలుపు ఉండడం.. అదే చోట గోయ్యి ఉన్నందున ఆ బస్సు వెనుక చక్రాలు కూరుకుపోయాయి.