Share News

రాజీవ్‌ హయాంలోనే విప్లవాత్మక మార్పులు

ABN , Publish Date - May 21 , 2024 | 11:28 PM

మాజీ ప్రధాని, దివంగత నేత రాజీవ్‌గాంధీ హయాంలోనే దేశంలో అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని కేంద్ర మాజీ మంత్రి డా.కిల్లి కృపారాణి, డీసీసీ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వరరావు అన్నారు. రాజీవ్‌ గాంధీ 33వ వర్ధంతిని టెక్కలిలో మంగళవారం నిర్వహిం చారు.

 రాజీవ్‌ హయాంలోనే విప్లవాత్మక మార్పులు
టెక్కలి: రాజీవ్‌గాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

టెక్కలి: మాజీ ప్రధాని, దివంగత నేత రాజీవ్‌గాంధీ హయాంలోనే దేశంలో అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని కేంద్ర మాజీ మంత్రి డా.కిల్లి కృపారాణి, డీసీసీ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వరరావు అన్నారు. రాజీవ్‌ గాంధీ 33వ వర్ధంతిని టెక్కలిలో మంగళవారం నిర్వహిం చారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కృపారాణి మాట్లాడుతూ.. ఢిల్లీ నుంచి గల్లీ వరకు జవహర్‌ గ్రామీణ రోజ్‌గార్‌ యోజన ద్వారా నిధులు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కిందన్నారు. 73-74 రాజ్యాంగ సవరణ, ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంలో విప్లవాత్మక మార్పులు, 18 ఏళ్లకే ఓటుహక్కు కల్పించిన మహనీయుడు రాజీవ్‌గాంధీ అని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు డాక్టర్‌ కిల్లి రామ్మోహనరావు, టీబీజీ గుప్త, పొట్నూరు ఆనందరావు, గోరింట కృష్ణ, మాధవ్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కాశీబుగ్గలో..

కాశీబుగ్గ: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 33వ వర్ధంతిని మంగళవారం స్థానిక కాంగ్రెస్‌ నాయకులు నిర్వహించారు. కాశీబుగ్గ పాత బస్టాప్‌ వద్ద ఉన్న రాజీవ్‌ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొని యాడారు. రాజీవ్‌ గాంధీ ఆశయాలను కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్‌ దువ్వా డ జీవితేశ్వరరావు, తంగుడు వీర్రాజు, రమేష్‌ సాహు, రాజారావు తదితరులు పాల్గొన్నారు.

పోలాకిలో..

పోలాకి: పోలాకి మండల పరిషత్‌ కార్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతిని మంగళవారం నిర్వహించారు. ఎంపీడీవో ఉషశ్రీ, సూపరింటెండెంట్‌ బలగ ప్రకాష్‌ తదితరులు రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన ప్రధానిగా అమలు చేసిన అనేక పథకాలను వివరించారు. కార్యక్రమంలో సచివాలయం, రెవెన్యూ, 108, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2024 | 11:28 PM