Land Accupation ఆక్రమిత భూమిలోని మొక్కల తొలగింపు
ABN , Publish Date - Dec 29 , 2024 | 11:53 PM
Land Accupation జగన్నాథపురంలో అక్రమార్కులు ప్రభుత్వ భూమి ని ఆక్రమించి కొబ్బరి మొక్కలు వేయడంతో వాటిని ఆదివారం తొలగించినట్లు తహసీల్దార్ రమేష్ కుమార్ తెలిపారు.

సంతబొమ్మాళి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జగన్నాథపురంలో అక్రమార్కులు ప్రభుత్వ భూమి ని ఆక్రమించి కొబ్బరి మొక్కలు వేయడంతో వాటిని ఆదివారం తొలగించినట్లు తహసీల్దార్ రమేష్ కుమార్ తెలిపారు. గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 315లో 0.82 సెంట్లు ప్రభుత్వ భూమిని ఆక్ర మించి కొబ్బరిచెట్లు నాటారని గ్రామస్థులు కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ ఆదే శాల మేరకు ఎక్స్‌కవేటర్ సాయంతో కొబ్బరి మొక్కలు తొలగించా మన్నారు. 80 ఏళ్లుగా మా ఆధీ నంలో ఉన్న భూమి లో కొబ్బరి మొక్కలు వేసుకున్నామని, రాజకీయ క్షక్షతో వాటిని తొలగించడం సరికాదని జోగు రాము లమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.