రేషన్ డీలరు.. సర్పంచ్
ABN , Publish Date - Dec 17 , 2024 | 12:12 AM
టెక్కలి మేజర్ పంచాయతీకి చెందిన వైసీపీ నాయకురాలు గొండేల సుజాత నిబంధనలకు విరుద్ధంగా రెండు చోట్ల ప్రభుత్వ లబ్ధి పొందుతున్నారు. ఆమె ఓవైపు సర్పంచ్‌గా, మరోవైపు ఎనిమిదో వార్డు రాజావీధి ప్రాంతంలో చౌకధరల దుకాణం(127100 నెంబరు) డిపో డీలర్‌గా వ్యవహరిస్తున్నారు.
- వైసీపీ నాయకురాలి ద్విపాత్రాభినయం
- 20 ఏళ్లుగా డీలర్‌గానూ కొనసాగుతున్న వైనం
- షోకాజ్ నోటీసు జారీ
టెక్కలి, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): టెక్కలి మేజర్ పంచాయతీకి చెందిన వైసీపీ నాయకురాలు గొండేల సుజాత నిబంధనలకు విరుద్ధంగా రెండు చోట్ల ప్రభుత్వ లబ్ధి పొందుతున్నారు. ఆమె ఓవైపు సర్పంచ్‌గా, మరోవైపు ఎనిమిదో వార్డు రాజావీధి ప్రాంతంలో చౌకధరల దుకాణం(127100 నెంబరు) డిపో డీలర్‌గా వ్యవహరిస్తున్నారు. 20 ఏళ్లుగా ఆమె డీలరుగా పని చేస్తున్నారు. 2021 ఫిబ్రవరి 29న టెక్కలి సర్పంచ్‌గా బాధ్యతలు చేప ట్టారు. ఇన్నాళ్లూ ఈ విషయాన్ని గుర్తించని అధికా రులు.. తాజాగా ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి సుజాతను పిలిచి సర్పంచ్‌గా వ్యవహరిస్తారా?, డీలర్‌గా ఉం టారా? ఏదో ఒకటి తేల్చుకోవాలని స్పష్టం చేశారు. దీంతో తాను సర్పంచ్‌గా టెక్కలి లోని పలు ప్రాంతాల్లో సీసీరోడ్లు, కాలువలు నిర్మించానని, వాటికి సంబంధించిన బిల్లులు రావాల్సి ఉన్నందున సమయం కావాలని ఆమె ఆర్డీవోను కోరారు. అయితే ఈ విష యం బయటకు పొక్కడంతో సుజా త ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో కొట్టుమిట్టా డుతున్నారు. అవసరమైతే సర్పంచ్ పదవికి రాజీనామా చేసి.. డీలర్ పోస్టులో కొనసాగేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. కాగా.. సర్పంచ్ గా ఆమె తీసుకున్న గౌరవవేతనమా? లేదా డీలర్‌గా ప్రభుత్వం నుంచి పొందే కమీషన్‌ను రికవరీ చేయా లా? అని అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ విషయమై ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి వద్ద ప్రస్తావించగా ఇప్పటికే సర్పంచ్‌గా, డీలర్‌గా వ్యవ హరిస్తున్న సుజాత నుంచి వివరాలు తీసుకున్నా మని తెలిపారు. ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేశా మని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించామని అన్నారు.