Share News

ఇద్దరి బాలికలపై అత్యాచారం?

ABN , Publish Date - Oct 21 , 2024 | 12:18 AM

ఇద్దరు బాలికలపై మరో ఇద్దరు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీన్ని మరో వ్యక్తి వీడి యోలు తీసి వికృతానందాన్ని పొందడం చర్చనీయాంశమవుతోంది.

ఇద్దరి బాలికలపై అత్యాచారం?

- వీడియో తీసి మరొకరి వికృతానందం

- విచారణ చేస్తున్న పోలీసులు

పలాస, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): ఇద్దరు బాలికలపై మరో ఇద్దరు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీన్ని మరో వ్యక్తి వీడి యోలు తీసి వికృతానందాన్ని పొందడం చర్చనీయాంశమవుతోంది. శనివారంరాత్రి ఈ ఘటన జరగ్గా ఆదివారం వెలుగు లోకి వచ్చింది. పరువు దృష్ట్యా ఈ తతం గంపై బాధిత కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావ డం లేదు. అయినప్పటికీ సమాచారం తెలుసుకున్న పోలీసులు తక్షణమే స్పం దించి ముగ్గురు అనుమానిత బాలుర్ల ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. వివరా ల్లోకి వెళితే.. పలాస-కాశీబుగ్గ మునిసి పాలిటీకి చెందిన ముగ్గురు బాలికలు (ఇంటర్‌ చదువుతున్నారు), ముగ్గురు బాలురు(డిగ్రీ) కలిసి జగనన్న కాలనీ సమీపంలో నిర్మానుష్యమైన ప్రాం తానికి శనివారం రాత్రి వెళ్లారు. అక్కడ బాలిక లపై బాలురు వికృతచేష్టలు చేశా రు. ఓ బాలుడు వాటిని వీడియోలో చిత్రీకరించి వికృతానందాన్ని పొందినట్లు సమాచా రం. ఈ వ్యవహారం ఆదివారం బయట పడడంతో.. విషయం పోలీసుల వరకూ వెళ్లింది. అంతా మైనర్లు కావడం.. పరువు పోతుందనే ఉద్దేశంతో బాధిత కుటుంబాలు కూడా పోలీసులకు ఎటువంటి ఫిర్యాదులు చేయలేదు. కాగా.. సమాచారం తెలుసుకుని కాశీబుగ్గ పోలీసులు అప్రమత్తమయ్యారు. ముగ్గురు బాలుర్లను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కాశీబుగ్గ సీఐ డి.మోహనరావును వివరణ కోరగా.. తమకూ ఈ సంఘటన సూచనప్రాయంగా తెలిసిందన్నారు. అనుమానిత బాలుర్లను ప్రశ్నిస్తున్నామని తెలిపారు. మొత్తం సంఘటన అంతా బాలబాలికల చుట్టూ ఉండడంతో చైల్డ్‌లైన్‌ సంస్థకు ఫిర్యాదు చేశామన్నారు. వారు వాస్తవాలు పరిశీలిస్తారని, వారిచ్చే నివేదిక ఆధారంగా కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాల నుంచి ఇప్పటివరకూ ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

Updated Date - Oct 21 , 2024 | 12:18 AM