Share News

రాములోరి కల్యాణం

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:01 AM

శ్రీరామనవమిని పురస్కరించుకుని జిల్లాలో ఆధ్యాత్మికత వెల్లివెరిసింది. ఊరూరా సీతారాముల కల్యాణం వైభవంగా సాగింది.

రాములోరి కల్యాణం
శ్రీకాకుళం కోదండ రామాలయంలో కల్యాణాన్ని తిలకిస్తున్న భక్తులు

- కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు

(శ్రీకాకుళం కల్చరల్‌)

శ్రీరామనవమిని పురస్కరించుకుని జిల్లాలో ఆధ్యాత్మికత వెల్లివెరిసింది. ఊరూరా సీతారాముల కల్యాణం వైభవంగా సాగింది. ఆలయాల్లో భక్తుల తాకిడి కనిపించింది. అంతటా శ్రీరామనామస్మరణ మార్మోగింది. శ్రీకాకుళంలోని పాలకొండ రోడ్డులో శ్రీకోదండరామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగదబిరాముడి పరిణయాన్ని పురోహితులు నిర్వహించగా.. భక్తులు పులకించారు. అలాగే మండలవీధి, పీఎన్‌ కాలనీ, వరసిద్ధి వినాయక ఆలయం, డీసీసీబీ కాలనీలోని వెంకటేశ్వరస్వామి, పుణ్యపువీధి, బాకర్‌సాహెబ్‌పేట తదితర ప్రాంతాల్లోని రామాలయాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

Updated Date - Apr 18 , 2024 | 12:01 AM