ఏపీ మార్క్‌ఫెడ్ డైరెక్టర్‌గా రామకృష్ణ బాధ్యతలు
ABN , Publish Date - Oct 05 , 2024 | 11:41 PM
ఏపీ మార్క్‌ఫెడ్ డైరెక్టర్‌గా ఆనెపు రామకృష్ణంనాయుడు శనివారం బాధ్యతలు చేపట్టారు.
బూర్జ: ఏపీ మార్క్‌ఫెడ్ డైరెక్టర్‌గా ఆనెపు రామకృష్ణంనాయుడు శనివారం బాధ్యతలు చేపట్టారు. విజయవాడలో మార్క్‌ఫెడ్ రాష్ట్ర కార్యాలయంలో వేద పండితుల మంత్రోచ్ఛరణ నడుమ మేళ తాలాలతో ఎంతో అట్టహాసంగా బాధ్యతలు స్వీకరించారు. మార్క్‌ఫెడ్ ఎండీ మన్‌జీర్ జిలాన్ సమూన్ ఆధ్వర్యంలో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణంనాయుడు మాట్లాడుతూ.. తనపై ఎంతో నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు రుణపడి ఉంటానని, తనకు ఇచ్చిన పదవికి వెన్నె తెచ్చేం దుకు కృషి చేస్తానన్నారు. రైతులకు పూర్తిస్థాయిలో ఎరువులు అందేలా చర్యలు చేపడతానన్నారు.