Share News

రైల్వే జంక్షన్‌ సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:42 AM

మృత్‌ భారత్‌ రైల్వేస్టేషన్‌ కింద ఎంపికైన నౌపడా రైల్వే జంక్షన్‌లో మౌలిక వసతులు కల్పించాలని సమతా సైనిక్‌దళ్‌ జిల్లా అధ్యక్షుడు చల్లా రామారావు కోరారు. ఈ మేరకు సోమవారం నౌపడా రైల్వే స్టేషన్‌లో వాల్తేరు డివిజన్‌ సీఈ ఆర్‌ఎం సింగ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.

రైల్వే జంక్షన్‌ సమస్యలు పరిష్కరించాలి

టెక్కలి: అమృత్‌ భారత్‌ రైల్వేస్టేషన్‌ కింద ఎంపికైన నౌపడా రైల్వే జంక్షన్‌లో మౌలిక వసతులు కల్పించాలని సమతా సైనిక్‌దళ్‌ జిల్లా అధ్యక్షుడు చల్లా రామారావు కోరారు. ఈ మేరకు సోమవారం నౌపడా రైల్వే స్టేషన్‌లో వాల్తేరు డివిజన్‌ సీఈ ఆర్‌ఎం సింగ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. నౌపడా ఆర్‌ఎస్‌ హైస్కూల్‌కు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మించాలని, నౌపడా జంక్షన్‌లో కోణార్క్‌, ఫలక్‌నుమా, పారాదీప్‌, హిరాఖండ్‌ రైళ్లకు హాల్ట్‌ కల్పిం చాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సంధ్యారాణి, ఎంపీటీసీ అప్పలరెడ్డి, లోకేష్‌, యోగి పాల్గొన్నారు.

ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం ఎల్‌సీ గేట్‌ వద్ద బ్రిడ్జి నిర్మించాలని పట్టణానికి చెందిన డాక్టర్‌ పూడి కిరణ్‌ కుమార్‌, బి.గాంధీ, ప్రతాప్‌రావు, ప్రమోద్‌ కోరారు. ఇచ్ఛా పురం రైల్వే స్టేషన్‌లో రైల్వే భువనేశ్వర్‌ చీఫ్‌ ఇంజి నీర్‌ చంద్రమోహన్‌కి వినతిపత్రం అందజేశారు.

పీఏసీఎస్‌ భవనం ప్రారంభం

సరుబుజ్జిలి: కొత్తకోట వద్ద పీఏసీఎస్‌ భవనాన్ని సోమవారం స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రారంభించారు. డీసీసీబీ చైర్మన్‌ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ సత్య నారాయణ, జడ్పీటీసీ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 12:42 AM