Share News

Quality standards పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

ABN , Publish Date - Dec 28 , 2024 | 11:37 PM

Quality standards గిరిజన ప్రాంతాల్లో చేపడు తున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చితం గా పాటించాలని గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర ఈఎన్‌సీ శ్రీనివాసరావు అన్నా రు.

Quality standards   పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
సూచనలిస్తున్న ఈఎన్‌సీ శ్రీనివాసరావు

మెళియాపుట్టి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల్లో చేపడు తున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చితం గా పాటించాలని గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర ఈఎన్‌సీ శ్రీనివాసరావు అన్నా రు. శనివారం మెళియాపుట్టి ఏకలవ్య పాఠ శాల, చాపర-ఎంసీపీ కొత్తూరు రోడ్డు, నందలపాడులో జరుగుతున్న పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏకలవ్య పాఠ శాల ప్రహరీ, సీసీ రోడ్లు పూర్తి చేయాలన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా భవనాలను పూర్తిచేసి అందించాలన్నారు. రోడ్డు పనుల వద్ద సిబ్బంది పర్యవేక్షణ ఉండాలన్నారు. నందలపాడు సామాజిక భవనంతో పాటు ఆరోగ్య ఉపకేంద్రం నిర్మాణానికి సుమారు రూ.60 లక్షలతో చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఆయతో పాటు ఈఈ రమాదేవి తదితరులున్నారు.

Updated Date - Dec 28 , 2024 | 11:37 PM