Share News

లక్కుపురంలో పూరిల్లు దగ్ధం

ABN , Publish Date - May 27 , 2024 | 11:33 PM

బూర్జ మండలం లక్కుపురంలో రేగాన ఆనందరావుకు చెందిన పూరిల్లు దగ్ధమైంది. ఆదివారం రాత్రి ఆనందరావు కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా.. సోమవారం తెల్లవారుజామున విద్యుత్‌షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి.

లక్కుపురంలో పూరిల్లు దగ్ధం
కాలి బూడిదైన ఇల్లు

బూర్జ, మే 27: బూర్జ మండలం లక్కుపురంలో రేగాన ఆనందరావుకు చెందిన పూరిల్లు దగ్ధమైంది. ఆదివారం రాత్రి ఆనందరావు కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా.. సోమవారం తెల్లవారుజామున విద్యుత్‌షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. వెంటనే ఆనందరావు కుటుంబ సభ్యులు అప్రమత్తమై ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. పాలకొండ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశామని పాలకొండ అగ్నిమాపకశాఖాధికారి జామి సర్వేశ్వరరావు తెలిపారు. ఈ ప్రమాదంలో 6.25 తులాల బంగారంతో పాటు రూ.50వేల నగదు, ఆహారపు ధాన్యాలు, దుస్తులు కాలి బూడిదయ్యాయని ఆనందరావు, కుటుంబ సభ్యులు వాపోయారు. బాధిత కుటుంబాన్ని ఎంపీపీ కె.దీప పరామర్శించి.. ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అలాగే అన్నంపేటకు చెందిన కాశీవిశ్వేశ్వర భజన భక్త బృందం సభ్యులు నిత్యావసర సరుకులు, దుస్తులతోపాటు రూ.6వేలు నగదు బాధితులకు అందించారు.

Updated Date - May 27 , 2024 | 11:33 PM