Share News

సైకో రెడ్డిని ఇంటికి పంపడం ఖాయం

ABN , Publish Date - Feb 25 , 2024 | 12:16 AM

రానున్న ఎన్నికల్లో సైకో రెడ్డిని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు.

సైకో రెడ్డిని ఇంటికి పంపడం ఖాయం
ఆమదాలవలస: పార్టీలో చేరిన వారితో రవికుమార్‌

ఆమదాలవలస: రానున్న ఎన్నికల్లో సైకో రెడ్డిని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు. శనివారం కట్యాచార్యులుపేట గ్రామంలో వైసీపీకి చెందిన మాజీ సర్పంచ్‌ పైడి జగన్నాథరావుతోపాటు పైడి ఆనందరావు, సింగూరు రాజు, ఇలపండ రాజు, పద్మావతి మరో 50 కుటుంబాలు టీడీపీలో చేరారు. వారికి కండువాలు వేసి రవివకుమార్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురుతుందన్నారు. టీడీపీ శ్రేణులు సైనికుల్లా పనిచేసి గెలుపునకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నూకరాజు, సనపల ఢిల్లీశ్వరరావు, తమ్మినేని చంద్రశేఖర్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

వైసీపీ నుంచి టీడీపీలోకి పలు కుటుంబాలు
జి.సిగడాం:
సీతంపేట గ్రామానికి చెందిన వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరికి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామ్‌మల్లిక్‌ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ వల్లూరు వరహాల నాయుడు, కండాపు పాపినాయుడు, కె.సూరపు నాయుడు, కె.జనార్దన్‌, వి.రమణమూర్తి, వి.లక్షుం నాయు డు, టి.లక్షుంనాయుడు, కె.గోవిందరావు, డి.జనార్దన, కె.అప్పల నాయుడు, శాసపు రామ్‌ప్రసాద్‌, వి.రామ్మూర్తి, వి.అన్నం నాయుడు, వి.లక్షుంనాయుడు తదితరులున్నారు. కార్యక్రమంలో టంకాల మౌళీశ్వరరావు, పైల రామకృష్ణం నాయుడు, నక్క మురళి, మక్క చినప్పలనాయుడు, కండాపు చిన్నం నాయుడు, మీసాల రమణారావు, విక్రం సత్యారావు తదితరులు పాల్గొన్నారు.

గొండు శంకర్‌ ఆధ్వర్యంలో...
అరసవల్లి:
టీడీపీ నాయకుడు, ఉమ్మడి జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు గొండు శంకర్‌ ఆధ్వర్యంలో శనివారం మండలవీధి ప్రాంతానికి చెందిన 30 మంది మహిళలు టీడీపీలో చేరారు. నగరంలోని విశాఖ-ఏ కాలనీలోని తన కార్యాలయంలో శంకర్‌ వారి ని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ సూపర్‌ సిక్స్‌ పథకాల పట్ల ప్రజలు ఆకర్షి తులవుతున్నారని, రానున్న ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రానున్నదన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ అంబటి లక్ష్మీరాజ్యం, బొల్ల నాగేంద్ర యాదవ్‌, బుర్రి మధు, సానివాడ సర్పంచ్‌ రుప్ప లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 12:16 AM