Share News

మొబైల్‌ ఫోన్లు అందజేత

ABN , Publish Date - Apr 02 , 2024 | 11:36 PM

జిల్లాలో ప్రజలు పోగొ ట్టుకున్న సెల్‌ ఫోన్లు అతి త క్కువ సమ యంలోనే రికవరీ చేసిన బాధితులకు మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జీఆర్‌ రాధిక అందజేశారు.

మొబైల్‌ ఫోన్లు అందజేత

శ్రీకాకుళం క్రైం: జిల్లాలో ప్రజలు పోగొ ట్టుకున్న సెల్‌ ఫోన్లు అతి త క్కువ సమ యంలోనే రికవరీ చేసిన బాధితులకు మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జీఆర్‌ రాధిక అందజేశారు. సీఈఐఆర్‌.గవర్నమెంట్‌.ఇన్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్న బాధితుల వివరాల మేరకు విచారణ చేపట్టి, రికవరీ చేసి అందిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. మొబైల్‌ ఐఎంఈఐ నెంబర్లు బ్లాక్‌ అయిన తరువాత రిక్వెస్ట్‌ను రిసీ వ్‌ చేసుకుని మొబైల్‌ను ట్రాక్‌ చేసి పట్టుకుంటున్నట్టు తెలిపారు. సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా 146 ఫోన్లను రికవరీ చేసి బాదితులకు ఇచ్చామని ఎస్పీ రాధిక తెలిపారు. ఇ దివరకు జిల్లాలో లాస్ట్‌ మొబైల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ ద్వారా 244 ఫోన్లను రికవరీ చేశా మన్నారు. మరో 56 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఇస్తున్నట్టు తెలిపారు. ఈ విధానంలో ఇప్పటివరకు 446 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామ న్నారు. వాటి విలువ సుమారు రూ.55 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఫోన్‌ సెక్యూరిటీ లాక్‌ వినియోగించాలని, వ్యక్తిగత సమాచారాన్ని ఫోన్లో ఉంచకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. దూర ప్రాంతాల్లో ఉన్న ఫోన్లతో పాటు అతి విలువైన ఫోన్లు ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన సైబర్‌ సెల్‌ సీఐ టి.శ్రీను, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Updated Date - Apr 02 , 2024 | 11:36 PM