దేహదారుఢ్య పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Dec 28 , 2024 | 12:16 AM
Proper arrangements for physical fitness tests పోలీసు కాని స్టేబుల్ (స్టయిఫెం డరీ) పోస్టుల ఎం పిక ప్రక్రియలో భా గంగా ఎచ్చెర్లలోని సాయుధ పోలీసు మైదానంలో ఈ నెల 30వ తేదీ నుంచి నిర్వహించనున్న దేహదారు ఢ్య పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సూచించారు.

ఎచ్చెర్ల, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): పోలీసు కాని స్టేబుల్ (స్టయిఫెం డరీ) పోస్టుల ఎం పిక ప్రక్రియలో భా గంగా ఎచ్చెర్లలోని సాయుధ పోలీసు మైదానంలో ఈ నెల 30వ తేదీ నుంచి నిర్వహించనున్న దేహదారు ఢ్య పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సూచించారు. సా యుధ మైదానాన్ని ఆయన శుక్రవారం సందర్శించి పరిశీలించారు. అభ్యర్ధుల ప్రవేశం, బయటకు వెళ్లే మార్గాలను, ధ్రువ పత్రాల పరిశీలనకు కౌంటర్లను ఏర్పాటు చేయాల న్నారు. ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 100, 1600 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ ఈవెంట్‌ల నిర్వహణకు సిద్ధం చేసిన ట్రాక్‌లను పరిశీలించారు. ఏఎస్పీ కేవీ రమణ, ఏఆర్ డీఎస్పీ ఎల్.శేషాద్రి, ఏవో గోపీనాథ్, సీఐ అవతారం, ఆర్‌ఐ నర్సింగరావు, ఎస్‌ఐ సందీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.