Share News

హామీలను నిలబెట్టుకోవాలి

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:38 PM

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి వెంకట్‌ డిమాండ్‌ చేశారు.

హామీలను నిలబెట్టుకోవాలి

అరసవల్లి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి వెంకట్‌ డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం పర్యటనకు వచ్చిన ఆయన బుధవారం స్థానిక జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పంటలకు మద్దతు ధరల చట్టం తీసుకురావాలని, విద్యుత్తు సవరణ బిల్లును వెనక్కు తీసుకోవాలని, గ్రామీణ ఉపాధి హామీ చట్టం పని దినాలను పెంచాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిర్ల ప్రసాద్‌, గంగరాపు సింహాచలం, జి.ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 11:38 PM