భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
ABN , Publish Date - Mar 04 , 2024 | 11:45 PM
శివరాత్రి సందర్భంగా శ్రీముఖలింగం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందు లు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ జీఆర్ రాధిక ఆదేశించారు. సోమవారం ఆమె శ్రీముఖలింగంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు అందించారు.
గ్రామానికి రెండువైపులా వాహనాలు పార్కింగ్
ఎస్పీ జీఆర్ రాధిక
జలుమూరు: శివరాత్రి సందర్భంగా శ్రీముఖలింగం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందు లు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ జీఆర్ రాధిక ఆదేశించారు. సోమవారం ఆమె శ్రీముఖలింగంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు అందించారు. ఈనెల 8 నుంచి 11 వరకు నిర్వహించనున్న శివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ఉచిత, ప్రత్యేక దర్శనం కోసం వేర్వేరు క్యూలైన్లు, ఎండ తగలకుండా షామియానాలు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల వాహనాలకు గ్రామానికి రెండు వైపులా పార్కింగ్ సదుపాయం కల్పించాలని సూచించారు. నాలుగు చక్రాల వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలకు వేర్వేరు పార్కింగ్ స్థలాలు కేటాయించా లన్నారు. చివరి రోజు స్వామివారి చక్రతీర్థ స్నానాలకు అదనపు బలగాలు తెప్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. కార్య క్రమంలో టెక్కలి డీఎస్పీ డి.బాలచంద్రారెడ్డి, సీఐ బి.ప్రసాదరావు, ఎస్‌ఐ కె.మధుసూదనరావు, సర్పంచ్ సతీష్, ఎంపీటీసీ కరుకోల హరిప్రసాదరావు, దేవాలయ అర్చకులు శేషాద్రి వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా శ్రీముఖలింగం పంచాయతీలో శివరాత్రి ఉత్స వాల నేపథ్యంలో పారిశుధ్య పనులను చేపట్టారు. అలాగే ఆహ్వాన పత్రాలను ప్రజాప్రతి నిధులు, అధికారులకు ఈవో ప్రభాకరరావు అందజేసి ఆహ్వానించారు.