పశుగణాభివృద్ధికి ప్రాధాన్యం
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:16 PM
పశు గణాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడు అన్నారు. శుక్రవారం పెద్దబమ్మిడిలో 21 అఖిల భారత పశుగణన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కోటబొమ్మాళి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): పశు గణాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడు అన్నారు. శుక్రవారం పెద్దబమ్మిడిలో 21 అఖిల భారత పశుగణన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం ప్రారంభమైన పశుగణన 2025 ఫిబ్రవరి 28వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందన్నారు. సుమారు 150 కోట్ల కుటుంబాలకు చెందిన పశువుల వివరాలు నమోదు చేయాల్సి ఉందని దీనికి పాడి రైతులు సహకరించా లని కోరారు. ప్రస్తుతం యువతకు ప్రోత్సహిస్తూ డెయిరీ ఫారం నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయిలు మంజూరు చేస్తుందని, దీనిని యువ కులు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమం లో పశుసంవర్థకశాఖ జేడీ ఆర్.మురళీధర్, డీడీ వి.జయరాజు, ఏడీఏలు ఎం.లోకనాథం, జి.లోకనాఽథం, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.
ప్రణాళికాబద్ధంగా పశుగణన: జేసీ
పలాసరూరల్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): పశుగణన కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని జాయింట్ కలె క్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ అన్నారు. పలాస ఆర్డీవో కార్యా ల యంలో శుక్రవారం నుంచి ప్రారంభిస్తున్న పశుగణన పోస్ట ర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. 2025 ఫిబ్రవరి 28వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పశుగణన చేపట్టాలని సూచిం చారు. ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి సర్వే పూర్తి చేసి డోర్లపై స్టిక్కర్లను అంటించాలన్నారు. కార్యక్రమంలో పశు సంవర్ధక ఏడీ పి.చంద్రశేఖర్, తహసీల్దార్ కల్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
పశుగణనను ప్రారంభించిన ఎమ్మెల్యే
పోలాకి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి చేపట్టిన పశుగణనను తలసముద్రం గ్రామంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వే సరిగా చేపట్టి పాడి రైతులకు తోడ్పడాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సూరప నారాయణ దాస్, వెంకటరమణ, మెండ ఆనందరావు, పశు వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
ఇంటింటికీ వెళ్లి సర్వే చేపట్టాలి
మందస,అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): పశుగణనలో భాగంగా ఇంటింటికీ వెళ్లి పశువుల వివరాలు సేకరించి ఇళ్లకు సిక్కర్లను అతికించాలని పశువైద్యాధికారులు దువ్వా డ శ్రీకాంత్, కిల్లి ఉమాభారతి అన్నారు. శుక్రవారం స్థానిక పశు సంవర్థక శాఖ కార్యాలయంలో పోస్టర్లను ఆవిష్కరిం చారు. కార్యక్రమంలో ఎన్యూమరేటర్లు ధర్మేంద్ర, బాలకృష్ణ, శ్రీనివాస్, హరికృష్ణ, కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.