నియోజకవర్గంలో సాగు, తాగునీటికి ప్రాధాన్యం
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:26 PM
నియోజకవర్గంలో ప్రతీ ఇంటికి తాగునీరు.. ప్రతీ ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యం గా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.

నరసన్నపేట,జూలై 28: నియోజకవర్గంలో ప్రతీ ఇంటికి తాగునీరు.. ప్రతీ ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యం గా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. ఆదివారం సత్యవరం గ్రామంలో ఇంటింటికీ తాగునీరందించే కొళాయిలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాగునీటి కోసం సత్యవరం గ్రామంలో ప్రజలు పడు తున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే దేవాది వద్ద బోరు పంపులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే వంశధార కాలువల పనులు చేయించి ప్రతీ ఎకరాకు సాగునీరు కల్పించడం జరిగిందని, రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారన్నారు.అంతకుముందు పాదాల అమ్మవారి అలయంలో పూజలు చేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వంట గదిని ప్రారంభించారు. కార్యక్రమంలో మావుడూరి జగదీష్‌బాబు, మాజీ సర్పంచ్ గొద్దు చిట్టిబాబు, ఉప సర్పంచ్ సాసుపల్లి కృష్ణబాబు, నేతలు కింజరాపు రామారావు, బైరి భాస్కరరావు, ధర్మాన తేజశ్వరరావు, శిమ్మ జగన్నాథం, నేతింటి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.