మహిళలపై లైంగిక వేధింపులు నిరోధించండి
ABN , Publish Date - Dec 28 , 2024 | 12:09 AM
Preventing sexual harassment of women పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు నిరో ధించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యద ర్శి, సివిల్ న్యాయాధికారి ఆర్.సన్యాసినాయుడు అన్నారు.

గుజరాతీపేట, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు నిరో ధించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యద ర్శి, సివిల్ న్యాయాధికారి ఆర్.సన్యాసినాయుడు అన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో మహిళలపై లైంగిక వేధింపులు, వీధి బాలలతో భిక్షాటన చేయించడం, మానవ అక్రమ రవాణా తదితర చట్టాలపై అ వగాహన కల్పించారు. ప్రతి కార్యాలయంలో అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాల న్నారు. డీసీపీవో కేవీ రమణ, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి శాంతి ప్రియ పాల్గొన్నారు.
- ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో హెచ్‌ఐవీ వ్యాప్తిని అరికట్టేందుకు సామాజిక బాధ్యతగా పనిచేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినా యుడు అన్నారు. నగరంలో శుక్రవారం ఓ ప్రైవేట్ హోటల్‌లో జిల్లాస్థాయి కన్సల్టెంట్ వర్క్‌షాప్‌ను నిర్వహించారు. కార్యక్రమంలో డీఎల్‌వో శ్రీకాంత్, సీపీఎం ఆదిలింగం, డీఎస్‌పీఎం అపర్ణ, రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు, శ్రీకాకుళం ఏఆర్డీ మెడికల్ ఆఫీసర్ బి.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.