Share News

సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలి

ABN , Publish Date - Mar 01 , 2024 | 11:46 PM

ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలాని సమూన్‌ ఆదేశించారు. రెడ్డీస్‌ ల్యాబ్‌ ఫౌండేషన్‌ ఆధునికీకరించిన జి.సిగడాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభిం చారు.

సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలి

జి.సిగడాం: ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలాని సమూన్‌ ఆదేశించారు. రెడ్డీస్‌ ల్యాబ్‌ ఫౌండేషన్‌ ఆధునికీకరించిన జి.సిగడాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభిం చారు. ఈసందర్భంగా ఆయన వైద్యాధికారులతో మాట్లాడారు. గర్భిణులకు మెరుగైన సేవలందించడంతోపాటు సాధారణ ప్రసవాల రేటు పెంచాలన్నారు. వైద్యాధికారులు స్థానికంగా నివాసముండి సమయపాలన పాటించాలన్నారు.విధి నిర్వహణలో అల సత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండే షన్‌ సీఈవో షమిక్‌ ట్రెహాన్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు ఎనిమిది పీహెచ్‌ సీలనుఇదే స్థాయిలో ఆధునికీకరించామని, మరో తొమ్మిది సీహెచ్‌సీల నవీనీకరణకు సిద్ధంగా ఉన్నాయన్నారు.కార్యక్రమంలో ఎంపీపీ, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్యన్‌ మీసాల సత్యవతి, మండల ప్రత్యేక ఆహ్వానితుడు మీసాల వెంకటరమణ, సర్పంచ్‌ ముద్దాడ ఈశ్వరమ్మ, పి.సోనియా, డీఎంహెచ్‌వో బొడ్డేపల్లి మీనాక్షి, ఆర్డీవో రంగయ్య, తహసీల్దార్‌ ఎన్‌.నిర్మల, వైద్యాధికారులు బి.యశ్వంత్‌, పి.సుమబిందు, సీహెచ్‌వో శివ ప్రసాద్‌, రెడ్డీస్‌ సీనియర్‌ డైరెక్టర్‌ కేవీఎస్‌ఎన్‌ రాజు, ప్రణవ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఎంఎస్‌ఎంఈలను సద్వినియోగం చేసుకోవాలి

కలెక్టరేట్‌ : యువత ఎంఎస్‌ఎంఈలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ మంజీర్‌ జిలానీ సమూన్‌ పిలుపనిచ్చారు. శుక్రవారం శ్రీకాకుళంలోని తన కార్యాల యంలో ఎంఎస్‌ఎంఈల ఏర్పాటు, సర్వే అండ్‌ సపోర్ట్‌ బ్యానర్‌ను ఆవిష్కరించా రు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈల ఏర్పాట్లు, సర్వే కార్య క్రమం ఈనెల 20 వరకు జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల జీఎం ఉమామహేశ్వరరావు, ఏడీలు రమణారావు, రఘునాథరావు పాల్గొన్నారు.

విద్యార్థులకు బహుమతులు ప్రదానం

శ్రీకాకుళంలోని జడ్పీ సమావేశ మందిరంలో ఆర్‌బీఐ ఆదేశాల మేరకు గతనెల 26 నుంచి నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యతా వారోత్సవాల్లో భాగంగా కలెక్టర్‌ మంజీర్‌ జిలానీసమూన్‌, జేసీ ఎం.నవీన్‌తో కలిసి సంబంధిత గోడపత్రిక, కరపత్రాలు, బ్యానర్లను ఆవిష్కరించారు. పాఠశాలల, ఇంటర్‌, డిగ్రీ కళాశాలల విద్యార్థులకు క్విజ్‌ పోటీలు నిర్వహించి, విజేతలకు కలెక్టర్‌ సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు.

జిల్లాలో 45,869 మందికి ‘విద్యాదీవెన’

జిల్లాలో 45,869 మంది తల్లుల ఖాతాల్లో రూ.35.17 కోట్లు విద్యాదీవెన పథ కం కింద జమచేసినట్లు కలెక్టర్‌ మంజీర్‌ జిలానీ సమూన్‌ తెలిపారు. ముఖ్య మంత్రి జగన్‌ కృష్టా జిల్లా పామర్రులో శుక్రవారం బటన్‌ నొక్కి తల్లుల, విద్యా ర్థుల ఖాతాల్లో నేరుగా జమచేశారు. ఈమేరకు కలెక్టర్‌ నమూనా చెక్కును విద్యా ర్థులకు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.గణపతిరావు, సోషల్‌ వెల్ఫేర్‌ అధికారి విశ్వమోహన్‌రెడ్డి, బీసీ సంక్షేమాధికారి అనూరాధ, ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారి శ్రీనివాస్‌, పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 11:46 PM