సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:44 PM
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్ర జాదర్బార్ నిర్వ హిస్తున్నట్టు ఎ మ్మెల్యే గొండు శంకర్ అన్నారు.

గార, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికే ప్ర జాదర్బార్ నిర్వ హిస్తున్నట్టు ఎ మ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శుక్రవారం స్థాని క తహసీల్దార్ కార్యాలయ ఆవ రణలో మండల స్థాయి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఆయన ని ర్వహించారు. ఈ సందర్భంగా మండల అభివృ ద్ధి ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యల తో కూడిన వినతి పత్రాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా ఇళ్ల స్థలాలకు, పిం ఛన్లు, కొత్త రేషన్ కార్డులు మంజూరు ఇతర సమస్యలపై ప్రజలు దరఖాస్తు చేసుకున్నారని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎస్.రమ ణారావు, ఎంపీడీవో ఎస్.రామమోహనరావు, కూటమి నాయకులు పీస వెంకటరమణ మూ ర్తి, గుండ భాస్కరరావు, గొండు వెంకటరమణ మూర్తి, బడగల వెంకట అప్పారావు, కొంక్యాన రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.