పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు ఆదర్శం
ABN , Publish Date - Mar 17 , 2024 | 12:15 AM
అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం భావిత రాలకు ఆదర్శమని డీఆర్వో ఎం.గణపతిరావు అన్నారు.
- జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు
కలెక్టరేట్: అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం భావిత రాలకు ఆదర్శమని డీఆర్వో ఎం.గణపతిరావు అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా శనివారం కలెక్టర్ సమా వేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు ప్రాణాలను కూడా ఫణంగా పెట్టిన మహోన్నత వ్యక్తి అని, ఆయన జీవితం ఎప్పటికీ అనుసరణీయమన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రా ఏ ర్పాటుకు తన ప్రాణాలను అర్పించిన అమరుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి ఇ.అనూరాధ, సహాయ అధికారి ఎల్.అప్పారావు, కార్యాలయ సిబ్బంది మమత, జి.గణేష్, శేఖర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో..
శ్రీకాకుళం క్రైం: ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన మహోన్నత వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని ఎస్పీ జీఆర్ రాధిక కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సంద ర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఎస్పీ జి.ప్రేమ్‌కాజల్, డీఎస్పీ ఎల్.శేషాద్రినాయుడు, ఏవో సీహెచ్ గోపీనాఽథ్, సీఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.
ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో..
ఎచ్చెర్ల: ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంపస్ డైరెక్టర్ కేవీజీడీ బాలాజీ మాట్లాడుతూ.. భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో మొదటిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందన్నారు. ఓఎస్డీ సుధాకర్‌బాబు, ఏవో ముని రామకృష్ణ, డీన్ కొర్ల మోహనకృష్ణ చౌదరి, ఎఫ్‌వో అసిరినాయుడు, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ పి.ముకుందరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు చేసి నివాళులర్పించారు.