Share News

పోస్టల్‌ బ్యాలెట్‌ మరింత సరళీకృతం

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:18 PM

ఎన్నికల్లో ప్రతి ఓటూ ఎంతో కీలకం. దీనిదృష్ట్యా పోలింగ్‌ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు కూడా పూర్తిస్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రత్యేకంగా పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించారు. విధుల్లో ఉండేవారిలో 50 శాతం మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ తీసుకుంటే, దాంట్లో కొందరు ఓటు వేసినా సకాలంలో పంపించడం లేదు. మరికొందరు పోస్టల్‌ ఓట్లు తప్పులతడకగా ఉండడంతో వాటిని పరిగణనలోకి తీసుకోరు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరింత సౌకర్యవంతంగా పోస్టల్‌ బ్యాలెట్‌ విధానాన్ని సరళీకృతం చేసింది.

 పోస్టల్‌ బ్యాలెట్‌ మరింత సరళీకృతం

(సరుబుజ్జిలి)

ఉపయోగించే ఫారాలు

ఫఫారం-12: పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసే పత్రం.

ఫఫారం-13(ఎ): ఓటరు ద్రువీకరణ పత్రం.

ఫఫారం-13 (బి): కవరు లోపల పోస్టల్‌ బ్యాలెట్‌ పెట్టాల్సిన కవరు.

ఫఫారం-13(సి): కవరు-బిపైన ఉండే కవరు, రిటర్నింగ్‌ అధికారికి తిరిగి పంపించాల్సిన కవరు.

ఉద్యోగి డిక్లరేషన్‌ సంతకం లేకపోతే..

డిక్లరేషన్‌లో బ్యాలెట్‌ పేపర్‌ సీరియర్‌ నెంబర్‌ రాయకపోవడం, గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరణ లేకపోవడం, ఓటేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ను 13బి కవరులో పెట్టకపోడం, సీటు వేయకపోవడం, పోస్టల్‌ బ్యాలెట్‌, డిక్లరేషన్‌లో ఒకే కవరులో పెట్టడం, బ్యాలెట్‌లో సంతకం చేయడం, ఓటు రహస్యతను కాపాడకపోవడం, ఏ అభ్యర్థికి చెందకుండా పైన లేదా మార్క్‌ చేయడం వంటి కారణాల వల్ల ఓటు తిరస్కరణకు గురవుతుంది.

ఫ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగులకు ఉత్తర్వులతో పాటు ఫారం-12 అందజేస్తారు. ఫారం-12ను పూర్తిగా నింపి రిటర్నింగ్‌ అధికారికి ఎన్నికల మొదటి విడత శిక్షణ కార్యక్రమంలో ఏర్పాటు చేసే ఫెసిటిటేషన్‌ కేంద్రంలో అందించాలి. ఉద్యోగికి అదే ఆర్వో పరిధిలోని నియోజకవర్గంలోని ఓటు ఉన్నట్లయితే పోస్టల్‌బ్యాలెట్‌ నేరుగా లేదా రిజిస్టర్‌ పోస్టు ద్వారా అందజేస్తారు.

ఫ ఉద్యోగి ఫారం-12తోపాటు ఎన్నికల విధులు ఉత్తర్వులు కాపీ, ఓటరు గుర్తింపు కార్డు, ఉద్యోగి గుర్తింపు కార్డు, జిరాక్స్‌ కాపీలు జతచేయాలి. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఆధ్వర్యంలో రెండోవిడత శిక్షణ సమయంలో ఫెసిలిటేషన్‌ సెంటర్‌ వద్ద అందరికీ అందుబాటులో ఉండే విధంగా పోస్టల్‌బ్యాలెట్‌ డ్రాప్‌బాక్స్‌ ఏర్పాటు చేస్తారు. పోస్టల్‌ బ్యాలెట్‌ పొందిన ఉద్యోగులంతా తమ ఓటు హక్కును వినియోగించుకుని ఫారం-13 కవర్‌ బీలో మార్క్‌ చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ పొందుపరిచి కవరుతో పాటు ధ్రువీకరణ పత్రం 13 ఏ గెజిటెడ్‌ అధికారి సర్టిఫై చేసి సంతకంతో కవర్‌బి (13సి) కవర్‌లో పొందుపరిచి డ్రాప్‌ బాక్సులో వేయాలి. లేదా ఆర్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాక్సులో వేయవచ్చు. లేదా ఆర్వోకు నిర్దిష్ట సమయంలో చేరే విధంగా పోస్టు ద్వారా పంపించవచ్చు. కవర్‌కు ఏ విధమైన పోస్టల్‌ స్టాంపులు అంటించాల్సిన అవసరం లేదు. పోలింగ్‌కు ఏడు రోజులు ముందు వరకు ఫారం12, సంబంధిత ప త్రాలు అందించి ఆర్‌వో నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ పొందవచ్చు.

Updated Date - Apr 25 , 2024 | 11:18 PM