Share News

ప్రారంభమైన పాలిసెట్‌ కౌన్సెలింగ్‌

ABN , Publish Date - May 27 , 2024 | 11:35 PM

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ సోమవారం ప్రారంభమైంది. శ్రీకాకుళంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్‌ కేంద్రంలో తొలి రోజు 1 నుంచి 12 వేల లోపు ర్యాంకు వచ్చిన అభ్యర్థుల సర్టిపికెట్ల పరిశీలనకు 243 మంది హాజరయ్యారు.

ప్రారంభమైన పాలిసెట్‌ కౌన్సెలింగ్‌
విద్యార్థుల సర్టిపికెట్ల పరిశీలన

- తొలిరోజు 243 మంది హాజరు

ఎచ్చెర్ల, మే 27: పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ సోమవారం ప్రారంభమైంది. శ్రీకాకుళంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్‌ కేంద్రంలో తొలి రోజు 1 నుంచి 12 వేల లోపు ర్యాంకు వచ్చిన అభ్యర్థుల సర్టిపికెట్ల పరిశీలనకు 243 మంది హాజరయ్యారు. ఇందులో 237 మంది ఓసీ, బీసీ అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఆరుగురు ఉన్నారు. ఓసీ, బీసీ అభ్యర్థుల నుంచి రూ.700, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి రూ.250 ప్రోసెసింగ్‌ ఫీజు వసూలు చేశారు.

- మంగళవారం 12,001 నుంచి 27,000 వరకు ర్యాంకు వచ్చిన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన జరగనుంది. 1 నుంచి 50 వేల లోపు ర్యాంకు వచ్చి సర్టిఫికేట్ల పరిశీలన పూర్తిచేసుకున్న అభ్యర్థులు ఈ నెల 31, జూన్‌ 1 తేదీల్లో కోర్సులు, కళాశాలల ఎంపిక కోసం ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. జూన్‌ 3వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నారు. 5వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తిచేసుకున్న అభ్యర్థులకు లాగిన్‌ ఐడీ వస్తుంది. ఒక వేళ లాగిన్‌ ఐడీ రానట్టయితే అభ్యర్థులు స్వయంగా హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని సంప్రదించాలి. జూన్‌ 7న సీట్ల కేటాయింపు వివరాలను పాలిసెట్‌ కన్వీనర్‌ ప్రకటిస్తారు. సమన్వయకర్త జి.దామోదరరావు, సహాయ సమన్వయకర్త డి.మురళీకృష్ణ పర్యవేక్షణలో సర్టిఫికేట్ల పరిశీలన జరుగుతోంది. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ సీహెచ్‌ నాగరాణి, డీడీ డాక్టర్‌ ఎంఏవీ రామకృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్‌, జాయింట్‌ సెక్రటరీ డాక్టర్‌ బి.జానకిరామయ్య కౌన్సెలింగ్‌ తీరును పరిశీలించారు.

Updated Date - May 27 , 2024 | 11:35 PM