Share News

పేట..ఎవరి కోట

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:50 PM

జిల్లాలో నరసన్నపేట నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతీ ఎన్నికల్లో ఇక్కడ ఓటర్లు విలక్షణ తీర్పు ఇస్తుంటారు. ఇప్పటివరకు టీడీపీ నాలుగుసార్లు, కాంగ్రెస్‌ ఐదుసార్లు, వైసీపీ రెండుసార్లు గెలుపొందాయి. గతంలో శిమ్మ, ధర్మాన, బగ్గు కుటుంబాల మధ్యే తీవ్ర పోటీ ఉండేది. ఈసారి ఎన్నికల్లో టీడీపీ నుంచి బగ్గు రమణమూర్తి, వైసీపీ నుంచి ధర్మాన కృష్ణదాస్‌ బరిలో నిలిచారు. వీరిది ఒకే గ్రామం, ఒకే సామాజిక వర్గం, పైగా సమీప బంధువులు. దీంతో గెలుపు కోసం ఇరువురూ శ్రమిస్తోన్నారు. అయితే, ఇక్కడ టీడీపీ కేడర్‌ బలంగా ఉండడంతో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 పేట..ఎవరి కోట

జిల్లాలో నరసన్నపేట నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతీ ఎన్నికల్లో ఇక్కడ ఓటర్లు విలక్షణ తీర్పు ఇస్తుంటారు. ఇప్పటివరకు టీడీపీ నాలుగుసార్లు, కాంగ్రెస్‌ ఐదుసార్లు, వైసీపీ రెండుసార్లు గెలుపొందాయి. గతంలో శిమ్మ, ధర్మాన, బగ్గు కుటుంబాల మధ్యే తీవ్ర పోటీ ఉండేది. ఈసారి ఎన్నికల్లో టీడీపీ నుంచి బగ్గు రమణమూర్తి, వైసీపీ నుంచి ధర్మాన కృష్ణదాస్‌ బరిలో నిలిచారు. వీరిది ఒకే గ్రామం, ఒకే సామాజిక వర్గం, పైగా సమీప బంధువులు. దీంతో గెలుపు కోసం ఇరువురూ శ్రమిస్తోన్నారు. అయితే, ఇక్కడ టీడీపీ కేడర్‌ బలంగా ఉండడంతో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

(నరసన్నపేట)

మొదటి సాధారణ ఎన్నికల తరువాత 1952లో ఏర్పడిన నగరికటకం నియోజకవర్గంలో నరసన్నపేట అంతర్భాగంగా ఉండేది. ఈ నియోజక వర్గ మొదటి ఎమ్మెల్యేగా హెచ్‌.సత్యనారాయణ దొర ఎన్నికయ్యారు. అయితే, 1957లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో నగరికటకం అంతరించి దానిస్థానంలో కొత్తగా నరసన్నపేట నియోజవర్గంగా ఏర్పడింది. అదే ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో వండాన సత్యనారాయణపై శిమ్మ జగన్నాథం గెలుపొందారు. నాటి నుంచి నేటి వరకు వెలమ సామా జిక వర్గానికి చెందిన వ్యక్తులే శాసన సభ్యులుగా ఎన్నికవుతున్నారు. ఒకసారి మాత్రం కాపు సామాజిక వర్గానికి చెందిన డోల సీతారాములు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1957 నుంచి 1972 వరకు స్వతంత్ర పార్టీకి చెందిన శిమ్మ జగన్నాథం ఎమ్మెల్యేగా కొనసాగారు. 1972లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగిన బగ్గు సరోజనమ్మ.. శిమ్మ జగన్నాథంపై విజయం సాధించారు. 1978లో జరిగిన ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగిన డోల సీతారాములు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత జరిగిన ఎన్నికల్లో శిమ్మ జగన్నా థం కుమారుడు శిమ్మ ప్రభాకరరావు టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధిం చారు. 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు టీడీపీ అభ్యర్థి శిమ్మ ప్రభాకరరావుపై గెలుపొందారు. 1994లో టీడీపీ అభ్యర్థి బగ్గు లక్ష్మణరావు, 1999లో కాంగ్రెస్‌ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు గెలు పొందారు. 2004 సాధారణ ఎన్నికల సమయానికి నియోజవర్గ పునర్వి భజనతో హరిశ్చంద్రపురం నియోజవర్గంలోని 44 పంచాయతీలు నరసన్నపేట నియోజవర్గంలో విలీనమయ్యాయి. అప్పటివరకు కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న ధర్మాన ప్రసాదరావు నరసన్నపేటలో తన సోదరుడు ధర్మాన కృష్ణదాస్‌ను పోటీలోకి దించారు. ప్రసాదరావు శ్రీకాకుళం నియోజవర్గానికి మారిపోయారు. 2004, 2009 ఎన్నికల్లోనూ, 2012 ఉప ఎన్నికలో, 2019 ఎన్నికలో ధర్మాన కృష్ణదాస్‌ విజయం సాధించారు.

మూడు కుటుంబాల మధ్యే పోరు...

నియోజవర్గంలో ప్రధానంగా మూడు కుటుంబాల మధ్యనే పోరు సాగు తుంది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా శిమ్మ జగన్నాథం, కాంగ్రెస్‌కు మద్దతుగా బగ్గు సరోజనమ్మ, డోల సీతారాములు కుటు ంబాలు వ్యవహరించాయి. ధర్మాన ప్రసాదరావు కుటుంబం 1989 నుంచి రాజకీ యాల్లోకి వచ్చింది. 2012 ఉప ఎన్నికల వరకూ ధర్మాన, బగ్గు కుటుంబాల మ ధ్య పోరు సాగింది. ప్రధానంగా శిమ్మ జగన్నాథం, ధర్మాన ప్రసాదరావు, బగ్గు లక్ష్మణరావు కుటుంబాల మధ్యే పోటీ ఉండేది. 2014, 2019, 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన బగ్గు రమణమూర్తి, వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణ దాస్‌లు సమీప బంధువులే. ఇరువురు ఒకే గ్రామానికి చెందిన వారు కావడం విశేషం. వీరిది పోలాకి మండలం మబగాం. 2014 ఎన్నికల్లో బగ్గు రమణమూర్తి ధర్మాన కృష్ణదాస్‌పై గెలుపొందగా, 2019 ఎన్నికల్లో ధర్మాన కృష్ణదాస్‌ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మళ్లీ వీరే పోటీల్లో ఉన్నారు. ఏదిఏమైనా నరసన్న పేట నియోజవర్గంలో ప్రధానంగా బంధువుల మధ్య పోటీ సాగుతుంది.

మారిన రాజకీయ స్వరూపం..

ధర్మాన కృష్ణదాస్‌కు అనుకూలంగా ఉండే నియోజవర్గంలో ఇప్పుడు రాజకీయ స్వరూపం మారింది. 2012 ఉప ఎన్నికలో వైసీపీ నుంచి ధర్మాన కృష్ణదాస్‌, కాంగ్రెస్‌ నుంచి ఆయన సోదరుడు ధర్మాన రామదాస్‌ పోటీ పడ్డారు. అప్పటివరకు ధర్మాన సోదరులకు అనుకూలంగా ఉండే మండల, గ్రామస్థాయి నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. 2014 ఎన్నికల్లో ధర్మాన సోదరులు ఒక్కటైనా.. క్యాడర్‌ మాత్రం ఒక్కటి కాలేకపోయారు. అప్పట్లో ధర్మాన ప్రసాదరావుకు అనుకూలంగా ఉండే పలువురు కీలక నాయకులు సైకిల్‌ ఎక్కారు. నరసన్నపేట మండలానికి చెందిన రాడ మోహనరావు, జలుమూరు మండలానికి చెందిన వెలమల కృష్ణారావు, దుంగ స్వామిబాబు, తర్ర పార్ధవరావు, పోలాకి మండలానికి చెందిన సూరపు నారాయణదాసు వంటి వారు టీడీపీలో చేరారు. వీరితో పాటు పలువురు గ్రామస్థాయి నాయకులు కూడా టీడీపీలో చేరారు. వారందర్ని కలుపుకుంటూ బగ్గు రమణమూర్తి సమన్వయంతో ముందుకు పోవడంతో 2014లో విజయం సాధించారు. 2019లో జగన్‌ రెడ్డి ఒక్క చాన్స్‌ ఇవ్వాలని కోరడంతో ప్రజలు నమ్మి ధర్మాన కృష్ణదాస్‌ను గెలిపించారు.

బలం పెంచేందుకు టీడీపీ వ్యూహం

2019 ఎన్నికల్లో జరిగిన పొరపాటు నుంచి బయట పడేందుకు టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి తన వ్యూహాన్ని మార్చారు. గ్రామస్థాయిలో అధికార పక్ష నాయకులను కలుపుకుంటూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను గ్రామాల్లో చురుగ్గా చేపడుతూ కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఆయన చాలా బలమైన నేతగా మారారు.

వెలమ సామాజికవర్గం అధికం

నియోజకవర్గంలో వెలమ సామాజికవర్గం ఓట్లు అధికం. బరిలో నిలిచిన అభ్యర్థులు ఇద్దరూ కూడా ఈ వర్గానికి చెందిన వారే. దీంతో ఆ సామాజిక వర్గ ఓట్లు రెండుగా చీలుతాయి. పోలాకి మండలంలో అత్యధికంగా కాళింగ సామాజిక వర్గం ఉండగా, సారవకోట మండలంలో కాపు ఓట్లు ఉన్నాయి. ముఖ్యంగా శ్రీశయన, వైశ్య , ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయిస్తాయి. వైశ్య, మత్స్యకార సామాజిక వర్గం ఓట్లు టీడీపీకి పడే అవకాశం ఉంది. శ్రీశయన, విశ్వబ్రాహ్మణ, నాయీబ్రాహ్మణులు ఎక్కువ శాతం టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మూడోసారి బగ్గు..

1982లో టీడీపీ ఆవిర్భావం నుంచి బగ్గు రమణమూర్తి పార్టీలో కొనసాగుతున్నారు. 2004, 2009లో రెండు పర్యాయాలు జడ్పీటీసీగా పనిచేశారు. 2009లో జడ్పీ చైర్మన్‌ పదవి వచ్చి చేజారిపోయింది జడ్పీ వైస్‌చైర్మన్‌గా వ్యవహరించారు. మొదటిసారిగా 2014లో నరసన్నపేట అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. 2019లో ఓడిపోయారు. ప్రస్తుత ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా మూడోసారి బరిలో దిగుతున్నారు. ఈయన భార్య బగ్గు సుగుణ జలుమూరు జడ్పీటీసీగా పనిచేశారు.

ఐదోసారి కృష్ణదాస్‌..

ధర్మాన కృష్ణదాస్‌ క్రియాశీలక రాజకీయాల్లోకి 2004లో వచ్చారు. అంతకు ముందు వరకూ తన తమ్ముడు ధర్మాన ప్రసాదరావు వెనుక ఉండేవారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం చేశారు. 2002లో జిల్లాలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేసిన పాదయాత్ర పట్ల ఆకర్షితులయ్యారు. 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి బగ్గు లక్ష్మణరావుపై గెలుపొందారు. 2009లో కూడా గెలుపొందారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మృతిచెందిన తరువాత ఆయన కుమారుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పెట్టిన వైసీపీలో చేరారు. 2012లో కాంగ్రెస్‌ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో తన సోదరుడు ధర్మాన రామదాస్‌పై గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి చేతిలో ఓడిపోయారు. 2019లో గెలుపొందారు. ఇప్పుడు ఐదోసారి బరిలో దిగుతున్నారు.

ఫ నియోజవర్గం పేరు : నరసన్నపేట

ఫ రిజర్వేషన్‌ : ఓపెన్‌

ఫ మండలాలు: నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట

ఫ గ్రామపంచాయతీలు: 125

ఫ లోకసభ నియోజవర్గం పరిధి: శ్రీకాకుళం

ఫ మొత్తం ఓటర్లు 2,012,933

ఫ పురుషులు : 1,06321

ఫ స్త్రీలు : 1,06599

ఫ ట్రాన్స్‌ జెండర్లు : 13

Updated Date - Apr 19 , 2024 | 11:50 PM