Share News

క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి: ఎస్పీ

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:49 PM

పోలీసు సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వహించాల ని ఎస్పీ కేవీ మహేశ్వ రరెడ్డి అన్నారు.

క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి: ఎస్పీ
గౌరవ వందనం స్వీకరిస్తున్న ఎస్పీ

ఎచ్చెర్ల, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): పోలీసు సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వహించాల ని ఎస్పీ కేవీ మహేశ్వ రరెడ్డి అన్నారు. ఎచ్చెర్ల సాయుధ పోలీసు మై దానంలో శుక్రవారం ని ర్వహించిన పోలీసు ప రేడ్‌ను పరిశీలించారు. తొలుత సాయుధ సిబ్బంది ఎస్పీకి గౌరవ వం దనం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సిబ్బంది అంకితభావంతో పని చేయాలన్నారు. అలాగే ప్రత్యేక గ్రీవెన్స్‌ నిర్వ హించి సిబ్బంది సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎల్‌.శేషాద్రి, ఆర్‌ఐ కె.న ర్సింగరావు, ఎస్‌ఐలు, ఏఆర్‌ సిబ్బంది పాల్గొన్నా రు. అలాగే పోలీసు అమరవీరుల స్మారక వారోత్సవాల్లో భాగంగా ఎచ్చెర్లలోని పోలీసు కమ్యూనిటీ హాల్‌లో శుక్రవారం పోలీసు సి బ్బందికి, వారి పిల్లలకు వ్యాసరచన, వకృత్త్వ పోటీలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ లో పోలీసుల సవాళ్లు అనే అంశంపై ఈ పోటీలు జరిగాయి. ప్రతిభ చూపినవారికి ప్రశంసా పత్రాలను, బహుమతులు ఎస్పీ చేతుల మీదుగా అందజేస్తారు.

Updated Date - Oct 25 , 2024 | 11:49 PM