Share News

పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:12 AM

రిమ్స్‌ సెక్యూరిటీ పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని, సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు, రిమ్స్‌ కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షుడు బి.మురళి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి

అరసవల్లి: రిమ్స్‌ సెక్యూరిటీ పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని, సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు, రిమ్స్‌ కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షుడు బి.మురళి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం యూనియన్‌ ఆధ్వర్యంలో రిమ్స్‌లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతీ నెల 5వ తేదీలోగా వేతనాలు చెల్లిం చాలని డిమాండ్‌ చేశారు. అతి తక్కువ వేతనంతో సెక్యూరిటీ సిబ్బంది దుర్భర జీవి తాలు అనుభవిస్తున్నారని, వారి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వ్యవహరించడం సరికాదన్నారు. నెల నెలా వేతనాలు చెల్లించడంలో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్నారని, ఏజెన్సీలను రద్దు చేసి, సెక్యూరిటీ, శానిటేషన్‌ సిబ్బందిని ఆప్కాస్‌లో చేర్చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ కన్వీనర్‌ ఆర్‌.ప్రకాశ రావు, రిమ్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఎం.సూర్యనారాయణ, కార్యదర్శి రాజేంద్ర, కోశాధికారి ఆర్‌.చిన్నారావు, రిమ్స్‌ నాయకులు కె.రవికుమార్‌, జి.అప్పన్న, బి.శ్రీను, రవి, చంద్రశేఖర్‌, బద్రి, సోమేష్‌, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:12 AM