Share News

పెచ్చులూడి..శిథిలావస్థకు చేరి

ABN , Publish Date - Jul 28 , 2024 | 11:27 PM

మండలంలోని తోణంగి గ్రామసచివాలయం భవనం శ్లాబ్‌ పెచ్చులు ఊడి పడుతున్నాయి. ప్రస్తుతం స్థానికంగా ఉన్న తుఫాన్‌ షెల్టర్‌లో సచివా లయం నిర్వహిస్తున్నారు.

  పెచ్చులూడి..శిథిలావస్థకు చేరి
సచివాలయం భవనం శ్లాబ్‌ పెచ్చులు ఊడుతున్న దృశ్యం :

గార: మండలంలోని తోణంగి గ్రామసచివాలయం భవనం శ్లాబ్‌ పెచ్చులు ఊడి పడుతున్నాయి. ప్రస్తుతం స్థానికంగా ఉన్న తుఫాన్‌ షెల్టర్‌లో సచివా లయం నిర్వహిస్తున్నారు. ఆ భవనం కూడా దశాబ్దాల కిందట నిర్మించినది కావడంతో శ్లాబ్‌ పెచ్చులు ఇటీవల ఊడిపోయి కింద పడుతున్నాయి. భవనం శిథిలావస్థకు చేరడంతో సిబ్బంది బిక్కు బిక్కుమని విధులు నిర్వహించాల్సి వస్తోంది. వైసీపీ హయాంలో గ్రామ సచివాలయం భవనం మంజూరుచేసినా పనులు అర్ధాంతరంగా నిలిపివేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అధికారులు చర్యలు తీసుకొని అసంపూర్తిగా ఉన్న సచివాలయం భవనం పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Jul 28 , 2024 | 11:27 PM