Share News

స్కీమ్‌ కార్మికులకు పనికి తగిన వేతనం చెల్లించండి

ABN , Publish Date - Mar 09 , 2024 | 11:56 PM

స్కీమ్‌ కార్మికులకు పనికి తగిన వేతనం చెల్లించాలని సిటు నాయకుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు డిమా ండ్‌ చేశారు. శనివారం జడ్‌పీ హైస్కూల్‌ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళల హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాటం చేయడమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్ఫూర్తిని కొనసాగించడమని అన్నారు.

స్కీమ్‌ కార్మికులకు పనికి తగిన వేతనం చెల్లించండి
సమావేశంలో మాట్లాడుతున్న అమ్మన్నాయుడు

రణస్థలం: స్కీమ్‌ కార్మికులకు పనికి తగిన వేతనం చెల్లించాలని సిటు నాయకుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు డిమా ండ్‌ చేశారు. శనివారం జడ్‌పీ హైస్కూల్‌ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళల హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాటం చేయడమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్ఫూర్తిని కొనసాగించడమని అన్నారు. ఆశ, మధ్యాహ్న భోజన పథకం తదితర స్కీమ్‌ కార్మికుల శ్రమకు తగిన ఫలితం ఇవ్వ కుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కె.సుజాత, ఆర్‌.అప్పమ్మ, బి. స్వాతి, బి.అసిరితల్లి, బి.సుజాత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2024 | 11:56 PM