Sports క్రీడలతో మానసికోల్లాసం
ABN , Publish Date - Dec 31 , 2024 | 12:05 AM
Sports క్రీడలతో మానసిక, శారీరక ఉల్లాసం కలుగుతుం దని, విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.

వజ్రపుకొత్తూరు, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): క్రీడలతో మానసిక, శారీరక ఉల్లాసం కలుగుతుం దని, విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. పూండి-గోవిందపురం హైస్కూ ల్‌లో నియోజకవర్గ స్థాయి గ్రిగ్స్ పోటీలను సోమ వారం ప్రారంభించారు. ఆసక్తి ఉన్న క్రీడను ఎం చుకుని అందులో తర్ఫీదు పొంది మంచి ప్రతిభ కనబరచా లన్నారు. అంత కు ముందు మాజీ ప్రధా ని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం ప్రకటించారు. క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడా కారుల్లో స్ఫూర్తిని పెంపొందించారు. విద్యార్థులు ప్రదర్శిం చిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డెరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు, మాజీ ఎంపీపీ జి.వసంతస్వామి, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కర్ని రమణ, హెచ్‌ఎం హరిబాబు, పీఈటీ తవిటయ్య, పలువురు ఉపాధ్యాయులు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఫ్లైఓవర్ నిర్వాసితులకు ఇళ్ల స్థలాలివ్వండి
పలాస, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గ ఎల్‌సీ గేటు ఫ్లైఓవర్ నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదేశించారు. సోమవారం సూదికొండ కాలనీలో ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి నిర్వాసితుడికి ఇంటి స్థలం మంజూరు చేయాలని, బ్రిడ్జి నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇప్పటికే ఇవ్వడం జరిగిందని, ఇంకా పెండింగ్‌లో ఉన్న వారికి త్వరలో పరిహారం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇప్పటికే బ్రిడ్జి నిర్మాణం ఆలస్యమైందని, పట్టాలిచ్చిన తరువాత ఆ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. ఈ సందర్భంగా ఎంత స్థలాన్ని కేటాయించారు, నిర్వాసి తులెంతమంది తదితర అంశాలను తహసీల్దార్ టి.కల్యాణ చక్రవర్తిని అడిగి తెలుసుకున్నారు. అనం తరం శ్మశానవాటికకు కేటాయించిన స్థలాలను పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూ రావు, సీనియర్ కౌన్సిలర్ దువ్వాడ శ్రీకాంత్, టంకాల రవిశంకర్‌గుప్తా, జోగ మల్లి, ఎ.రామకృష్ణ, చంద్రశేఖర్ త్యాడి, సర్వేయర్ వి.గిరి పాల్గొన్నారు.