Share News

అంతర్జాతీయ స్థాయికి పలాస జీడి పరిశ్రమలు

ABN , Publish Date - Oct 18 , 2024 | 12:03 AM

పలాస జీడి పరిశ్ర మలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్‌ ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ (ఏపీటీపీసీ) చైర్మన్‌ వజ్జ బాబూరావు అన్నారు. గురువారం పలాస పారిశ్రామికవాడలోని జీడిపరిశ్రమల సముదాయా లను సందర్శించారు.

అంతర్జాతీయ స్థాయికి పలాస జీడి పరిశ్రమలు
తిరుమలకు తరలించేందుకు సిద్ధం చేస్తున్న జీడి పప్పు నాణ్యతను పరిశీలిస్తున్న ఏపీటీపీసీ చైర ్మన్‌ వజ్జ బాబూరావు

ఏపీటీపీసీ చైర ్మన్‌ వజ్జ బాబూరావు

పలాస, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): పలాస జీడి పరిశ్ర మలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్‌ ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ (ఏపీటీపీసీ) చైర్మన్‌ వజ్జ బాబూరావు అన్నారు. గురువారం పలాస పారిశ్రామికవాడలోని జీడిపరిశ్రమల సముదాయా లను సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లా డుతూ.. జీడి పరిశ్రమలకు మహర్దశ రానుందని, తిరుపతి వెంకన్న ఆలయానికి కూడా పలాస జీడిపప్పు పంపుతుం డడం శుభపరిణామమన్నారు. ఎమ్మెల్యే గౌతు శిరీష, మం త్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌ నాయుడు సహకారంతో అన్ని ఆలయాల్లో మొక్కజీడి పప్పును ప్రమో షన్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఏపీటీపీసీని అగ్రగామి సంస్థగా చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న హార్బర్ల వద్ద తమ సంస్థకు పది ఎకరాలు చొప్పున స్థలా లివ్వాలని కోరామని, అందుకు సీఎం అంగీకరించారన్నారు. పక్కా గిడ్డంగులు నిర్మించి ప్రభుత్వానికి ఆదాయం తెచ్చి పెడతామన్నారు. అంతకు ముందు బాబూరావుకు వ్యాపా రవేత్త సంతోష్‌కుమార్‌ సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు డొక్కరి శంకర్‌, యవ్వారి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2024 | 12:03 AM