Share News

పొందూరులో పైడితల్లమ్మ సంబరాలు

ABN , Publish Date - May 21 , 2024 | 11:34 PM

పొందూరులో మంగళవారం తొల్లోడి పైడితల్లమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. నాయుడువారివీధి, చెల్లూరివారివీధిలో మేళతాళాలు, డప్పు చప్పుళ్లు, తప్పెటగుళ్లు, పులి వేషాలు ఆటలతో సంబరాలు జరిగాయి. చెల్లూరువారివీధిలోని పైడి తల్లమ్మ ఆలయానికి చేరుకుని చీర, సారె, పసుపు కుంకుమలు సమ ర్పించారు. చెల్లురి జయమ్మ అమ్మవారి ప్రతి రూపంగా నృత్యం చేస్తూ ఆలయానికి చేరుకున్నారు సంబరాల్లో చెల్లూరు సూరిబాబు, సురేం దర్‌కుమార్‌, డాక్టర్‌రాజేష్‌, డొకర శ్రీను, అచ్చియమ్మ, రాజమ్మ లీల తదితరులు పాల్గొన్నారు.

పొందూరులో పైడితల్లమ్మ సంబరాలు
పొందూరు: అమ్మవారి ఘటాలను ఊరేగిస్తున్న భక్తులు:

పొందూరు: పొందూరులో మంగళవారం తొల్లోడి పైడితల్లమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. నాయుడువారివీధి, చెల్లూరివారివీధిలో మేళతాళాలు, డప్పు చప్పుళ్లు, తప్పెటగుళ్లు, పులి వేషాలు ఆటలతో సంబరాలు జరిగాయి. చెల్లూరువారివీధిలోని పైడి తల్లమ్మ ఆలయానికి చేరుకుని చీర, సారె, పసుపు కుంకుమలు సమ ర్పించారు. చెల్లురి జయమ్మ అమ్మవారి ప్రతి రూపంగా నృత్యం చేస్తూ ఆలయానికి చేరుకున్నారు సంబరాల్లో చెల్లూరు సూరిబాబు, సురేం దర్‌కుమార్‌, డాక్టర్‌రాజేష్‌, డొకర శ్రీను, అచ్చియమ్మ, రాజమ్మ లీల తదితరులు పాల్గొన్నారు.

గదబపాలెంలో అసిరితల్లి పండుగ

జి.సిగడాం:మండలంలోని గదబపాలెంలో అసిరితల్లి గ్రామదేవత పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ శివారులో ఉన్న అమ్మవారి ఆలయంలో మహిళలు పసుపు, కుంకుమలు, ముర్రా టలు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కోలాటం, తప్పెటగుళ్లు, జానపదాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ వై.మధుసూద నరావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటుచేశారు.

బెజ్జిపుట్టుగలో కుంకుమ పూజలు

కవిటి: బెజ్జిపుట్టుగ గ్రామదేవత అసిరిపోలమ్మతల్లికి మంగళవారం సామూహిక కుంకుమపూజలు నిర్వహించారు. రాజేష్‌ స్వామి నేతృత్వంలో ఉపాధి వేతనదారుల ఆధ్వర్యంలో మహిళలు అమ్మవారికి పూజలు చేపట్టారు.

ఫఇచ్ఛాపురం:ఇచ్ఛాపురంలోని స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయం లో పలు వీధులకు చెందిన భక్తులు పూజలుచేశారు. గొల్లవీధి, ఉప్పాడ వీధులకు చెందిన కుటుంబాలు అమ్మవారి ఘటాలతో ఊరేగింపుగా వచ్చిమొక్కులు చెల్లించారు.

బూరవెల్లిలో నృసింహ జయంతి

గార:బూరవెల్లిలో ప్రాచీన శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మంగళవారం నృసింహ జయంతిని ప్రధాన అర్చకులు ఆరవెల్లి సీతా రామ స్వామి, అర్చకులు రాజేష్‌, శ్రీనివాస్‌, రమేష్‌ నిర్వహించారు. తొలుత విశ్వక్షేణ పూజ, పుణ్యాహవాచనం, పంచామృత అభిషేకం, సహస్రనామ అర్చన చేశారు.

Updated Date - May 21 , 2024 | 11:34 PM