బిల్లులు కాక.. పనులు జరగక
ABN , Publish Date - May 26 , 2024 | 11:43 PM
మండలంలోని గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేం ద్రాలు, వెల్‌నెస్ కేంద్రాల నిర్మాణాలు బిల్లులు కాకపోవడంతో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. వైసీపీ ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రజలకు పాలన అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థ, దీనికి అనుబంధంగా వెల్‌నెస్, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. ప్రతి సచివాలయం, ఆర్బీకే, వెల్‌నెస్ కేంద్రాలకు సొంత భవనాలు ఉండాలన్న లక్ష్యం పనులు ప్రారంభించా రు. అయితే బిల్లులు కాకపోవడంతో పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్లు పనులు అర్ధాంతరంగా నిలిపివేశారు. దీంతో పలు చోట్ల పునాదులు, మొండిగోడలతో దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం సచివాలయా లకు సొంత భవనాలు కల్పించాలన్న లక్ష్యం నీరుగారిపోయింది.
జలుమూరు: మండలంలోని గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేం ద్రాలు, వెల్‌నెస్ కేంద్రాల నిర్మాణాలు బిల్లులు కాకపోవడంతో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. వైసీపీ ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రజలకు పాలన అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థ, దీనికి అనుబంధంగా వెల్‌నెస్, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. ప్రతి సచివాలయం, ఆర్బీకే, వెల్‌నెస్ కేంద్రాలకు సొంత భవనాలు ఉండాలన్న లక్ష్యం పనులు ప్రారంభించా రు. అయితే బిల్లులు కాకపోవడంతో పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్లు పనులు అర్ధాంతరంగా నిలిపివేశారు. దీంతో పలు చోట్ల పునాదులు, మొండిగోడలతో దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం సచివాలయా లకు సొంత భవనాలు కల్పించాలన్న లక్ష్యం నీరుగారిపోయింది.
ఇదీ పరిస్థితి..
మండలంలో 24 గ్రామ సచివాలయ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రం, వెల్‌నెస్ సెంటరు భవనాలు నిర్మాణాలకు చర్యలు చేపట్టారు. ఐదేళ్లలో 24 గ్రామ సచివాలయాలకుగాను 15 గ్రామ సచివాలయాల భవనాలు పూర్తిచేశారు. మిగతా తొమ్మిది భవనాలు పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఇందులో లింగాలవలస, మర్రివలస, నగిరికటకం, గొటివాడ గ్రామ సచివాలయ భవనాల పనులు పునాదులకే పరిమితమయ్యాయి. సుబ్రమణ్యపురం, తలతరియా, జలుమూరు తదితర గ్రామ సచివాలయాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. 24 రైతు భరోసా కేంద్రాలకు గాను 16 రైతు భరోసా కేంద్రాలు భవనాల పనులు పూర్తిచేశారు. మిగతా ఎనిమిది కేంద్రాలు పనులు ఆగిపోయాయి. లింగాలవలస, మర్రివలస, నగిరికటకం, చల్లవానిపేట, గొటివాడ, పాగోడు, సుబ్రమణ్యపురం, జలుమూరు రైతు భరోసా కేంద్రాల పనులకు గాను కొన్ని పునాదుల స్థాయిలో నిలిచిపోగా, మరికొన్ని శ్లాబుస్థాయిలో నిలిచిపోయాయి. మండలంలో 20 వెల్‌నెస్ సెంటర్ల భవనాలకు గాను ఏడు మాత్రమే పనులు పూర్తయ్యాయి. మిగతా 13 వెల్‌నెస్ సెంటర్ల భవనాల పనులు కొన్ని పునాదుల స్థాయిలో నిలిచిపోయాయి. మరికొన్ని శంకుస్థాపన చేసిన శిలాఫలకాలు వెక్కిరిస్తున్నాయి.